కరెంట్ చార్జీలు ఎప్పుడు తగ్గిస్తావో చెప్పు కేసీఆర్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మంగళవారం సీఎం కేసీఆర్ యాసంగి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కరెండు చార్జీల విషయమై ప్రతి ఇంటికి వెళ్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా సంవత్సరానికి పాతబస్తీ నుండి వేయి కోట్లు రావాలని ఆయన అన్నారు. మతతత్వ వాదివి నువ్వు.. అంటూ కేసీఆర్ విమర్శలు చేశారు. డిస్కమ్ లకు 60 వేల కోట్లు ఇవ్వాలి.. ఎక్కడ 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నావని, రైతులకు ఇచ్చే ఫ్రీ కరెంట్ కు నేనే డబ్బులు కడుతున్న అని గుండె మీద చెయ్యేసి చెప్పు అని ఆయన సవాల్ విసిరారు. వచ్చేది బీజేపీ సర్కార్.. ఇవన్నీ కట్టేది బీజేపీ ప్రభుత్వమేనని, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, నిద్రలేని రైతులు గడిపారన్నారు.
ఆర్టీసీ ఛార్జ్ లను తగ్గించాలని, నాకు వ్యవసాయమే లేదు రైతు బీమా ఎక్కడ నుండి వస్తుందని, కబ్జా చేసిన స్థలంకి, కాలేజి స్థలంకు రైతు బంధు తీసుకోవడం లేదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేను ఒకరి చావును కోరుకునే మూర్ఖుణ్ణి కాదని, నాకు బీమా వస్తే ఆ డబ్బులు నా చావును కోరుకున్న వారికే ఇవ్వాలని నా ఆవిడ కు చెబుతానన్నారు. ఆదానికి 12 లక్షల కోట్లు మాఫీ చేశారని అనేది అబద్ధమని, వ్యవసాయ విధానం కేసీఆర్‌కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ధర్మం కోసం పక్కా మాట్లాడుతామని, ఇవాళ రాజా సింగ్ పై కేసు పెట్టారని, హనుమాన్, శివాజీ జయంతి చేసుకోవద్దా.. అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.