అమరావతిలో సీనియర్ ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అందులో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. అయితే తదుపరి ఉత్త్వులు జారీ చేసేంతవరకూ జవహరర్ రెడ్డి టీటీడీ ఈవోగానూ కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా […]
గెయిల్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొత్త భరోసా సెంటర్ ఏర్పాటు కోసం గెయిల్ ఇండియా లిమిటెడ్ మరియు భరోసా సొసైటీ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా, డీఐజీ బి సుమతి, భరోసా టెక్నికల్ డైరెక్టర్ మమతా రఘువీర్, గెయిల్ ఇండియా లిమిటెడ్ ZGM శరద్ కుమార్ తదితరుల సమక్షంలో మంగళవారం ఎంఓయూపై సంతకాలు జరిగాయి. […]
ఇవాళ్టి రోజుకో ప్రత్యేకత ఉంది. 22.02.2022! ఎటు నుండి చూసిన ఒకటే!! అంతేకాదు… ఇవాళ దర్శకుడు తేజ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా డి. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ ను ప్రకటించారు. ‘అహింస’ అనే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే, తేజ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమాను ప్రారంభించారు. […]
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ – 24 క్రాఫ్ట్స్ మరియు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కలసి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలను చర్చించటానికి ఇటీవల జి. ఆదిశేషగిరి రావుఅధ్యక్షతన సమావేశమైంది. చిత్ర పరిశ్రమలోని వివధ శాఖలకు చెందిన సభ్యులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలలోని అడ్మిషన్ […]
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లక్ష్మీగూడలో నవ వధువు వసంత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసకుంది. అదనపు కట్నం, భర్త వేధింపులు భరించలేక నవ వధువు బలవన్మరణంకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని వసంత ఆత్మహత్య చేసుకుంది. వసంత తన గదిలో నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో గది తలుపులను కుటుంబ సభ్యులు బద్దలు కొట్టారు. దీంతో […]
ఎన్నో సంక్షేమ పథకాలతో, తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని టీఆర్ఎస్ ఎంపీ బడుగు లింగయ్య అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా రాజకీయ పార్టీలు కేసీఆర్ ప్రయత్నాన్ని ఆహ్వానిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా దేశంలో కేసీఆర్ కు జనాదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణకు కేంద్రం మోసం చేస్తోందని, విభజన హామీలు నెరవేర్చమని కోరుతున్నా పట్టించు కోవటం లేదని ఆయన మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సరయినవి కావని ఆయన […]
నందమూరి తారక రత్న పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘సారథి’ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమా పూర్తి చేసిన తారక రత్నకి థ్యాంక్స్ అంటున్నారు దర్శకుడు జకట రమేష్. నిర్మాతలు పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ‘ఖో ఖో ఆట నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ […]
‘లవ్ స్టోరీ’ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ తనయుడు పవన్ సంగీత దర్శకుడయ్యాడు. ఆ సినిమాలోని అన్ని పాటలూ విజయవంతం కావడం ఒక ఎత్తు కాగా ‘సారంగ దరియా’ పాట సృష్టించిన సంచలనం మరో ఎత్తు. విశేషం ఏమంటే తాజాగా పవన్ తో సోనీ మ్యూజిక్, ది రూట్ అసోసియేషన్ సంస్థలు ‘గాంధారి’ అనే పాటను చేయించాయి. పవన్ సమకూర్చిన స్వరాలకు జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ […]
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ఫ్లైఓవర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) ప్రాజెక్టులను ఈ ఏడాది మార్చి నాటికి ప్రారంభించనున్నారు. తుకారాం గేట్ రోడ్ అండర్ బ్రిడ్జి, బహదూర్‌పురా ఫ్లైఓవర్, బైరామల్‌గూడ ఫ్లైఓవర్, బైరామల్‌గూడ అండర్ పాస్ వంటి ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు […]
తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు రాజేసుకుంటున్నాయి. అయితే తాజాగా తెలంగాణ బీజేపీ అసమ్మతి నేతల సమావేశం జరిగింది ఈ సమావేశంలో గతంలో భేటి అయిన నేతలే మరోసారి భేటి అయినట్టు సమాచారం. కరీంనగర్ నేతలతో పాటు హైదరాబాద్ కి చెందిన నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. గుజ్జుల రామ కృష్ణ రెడ్డి, సుగుణాకర్ రావు, వెంకట రమణి, రాములు మరికొందరు నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ లో పాతవారికి […]