ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మరో రసవత్తర పోరు జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు ఘోర పరాజయాలతో చవిచూసిన సీఎస్‌కే జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలనే లక్ష్యంతో సీఎస్‌కే ఉంది. ఇదిలా ఉంటే రెండు విజయాలతో జోరుమీదున్న ఆర్‌సీబీ హ్యాట్రిక్ కోసం వ్యూహం చేస్తోంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు జరుగగా సీఎస్‌కే అత్యధికంగా 18 సార్లు విజయం సాధించింది. ఆర్సీబీ కేవలం 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందగా, ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అంతేకాకుండా ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు (ధోని, కోహ్లి, డెప్లెసిస్, మ్యాక్స్‌వెల్) ఉండటం మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.