ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మరో రసవత్తర పోరు జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా నాలుగు ఘోర పరాజయాలతో చవిచూసిన సీఎస్‌కే జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే ఈ మ్యాచ్‌లోనైనా బోణీ కొట్టాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన సీఎస్‌కే భారీ స్కోరు ఆర్‌సీబీ ముందుంచింది. రాబిన్ ఊతప్ప విధ్వంకర ఇన్నింగ్స్ ఆడాడు.
50 బంతుల్లోనే 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 88 పరుగులు చేశాడు. కాగా హసరంగా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఊతప్ప పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా గోల్డెన్ డక్ అయ్యాడు. సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. మొదట 8 పరుగులు చేసిన డుప్లెసిస్ తీక్షణ బౌలింగ్‌లో జోర్డాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.