తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు జహీరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ… జహీరాబాద్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకే సారి 50 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది ఆయన అన్నారు. ఇప్పటికే మీ మున్సిపాలిటికీ చాలా సౌకర్యం కల్పించామని, మహిళల కోసం, కూరగాయల మార్కెట్ కోసం 14.50 కోట్లతో మార్కెట్ కడుతున్నామన్నారు. ఆగస్ట్ 15 వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. జహీరాబాద్ లో ఎటు చూసినా పచ్చదనమేనని, హరిత హారం కోసం 2.55 కోట్ల ఖర్చ చేశామన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రగతి కోసం 18.79 కోట్లు విడుదల చేశామని, మరో 50 కోట్లు మౌలిక వసతుల కోసం ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రైతాంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్ర తెలంగాణ అని ఆయన అన్నారు. రోజు మంచి నీళ్ళు వస్తున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోవాల్సింది కనీస సౌకర్యాలు, పేదలను ఆదుకోవాలి అని ఆయన అన్నారు. పెన్షన్లు అప్పట్లో 200 ఉండేవి.. ఇప్పుడు 2000 చేసినం.. అత్త, కొడళ్లు మంచిగా కలిసి ఉంటున్నారు.. 40 లక్షల ముందికి పెన్షన్ ఇస్తున్నం. మరో నెలల్లో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తాం.. ఈ ప్రాంతంలో సంగమేశ్వర దేవుడు చాలా పవర్ ఫుల్.. సింగూరు నీళ్లు తెచ్చి మీ బీడు భూములన్నీ తడుపుతాం.. లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని ఆయన మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి 12 లక్షల మందికి ఇస్తోందన్న కేటీఆర్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయన్నారు.