కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ సక్రమంగా జరిగిందని, ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరిగే సమయంలో అగ్నిపథ్ తెచ్చి యువతను నిరాశ పరిచారన్నారు. నాలుగేండ్లు మాత్రమే ఉద్యోగం ఇస్తున్నాడు మోడీ అంటూ ఆయన విమర్శలు చేశారు. ఆర్మీలో ఒక్క సారి సెలెక్ట్ అయ్యాక..రిటైర్మెంట్ అయ్యే వరకు ఉద్యోగం ఉండేదని, ఆర్మీ నుండి బయటకు వస్తే ఐదెకరాల భూమి…ఉద్యోగాలు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు భూములు లేవు.. పెన్షన్ లేదు..ఉద్యోగం లేకుండా చేశాడు మోడీ అంటూ ఆయన మండిపడ్డారు.
BRAOU : డిగ్రీ , పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
అగ్నిపథ్ ఆందోళనలు బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి మొదలైందని, అగ్నిపథ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ కూడా అగ్నిపథ్ రద్దు చేస్తాం అని మాట ఇచ్చారని, సికింద్రాబాద్ లో యువత ఉద్యోగాలు రావని ఆవేశంలో మోడీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారన్నారు. సికింద్రాబాద్ ఆందోళనకారులకు ఇప్పటికీ బెయిల్ కూడా రాలేదని ఆయన తెలిపారు. దీనికి బాధ్యులు మోడీనే అని ఆయన ఆరోపించారు. నిరుద్యోగుల పై ఉన్న కేసులు ఉపసంహరించుకోవాలన్న జగ్గారెడ్డి.. జైల్లో ఉన్న వారికి బెయిల్ వచ్చేలా చేయాలన్నారు. రాష్ట్రపతిగా గిరిజనులను పెట్టాము అని చెప్పడమే కాదని, గిరిజనులకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలన్నారు. అగ్నిపథ్‌కి మోడీ.. జమదగ్నిలా మారారన్నారు.