నల్లగొండ జిల్లా మునుగోడులో మీడియా సమావేశాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండిపడ్డారు. మంత్రికి ఇన్ని నియోజకవర్గాలు ఉండగా మునుగోడులో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయడంలో ఉన్న అంతర్యమేమిటి అని ఆయన ప్రశ్నించారు. మంత్రికి సూర్యాపేటలో గెలిచే దిక్కు లేదు గానీ మునుగోడులో తిరగడం ఏమిటి అంటూ ఆయన మండిపడ్డారు. దళితులు తక్కువగా ఉన్న గ్రామాలు ఎంచుకుని దొంగలలాగా ప్రొటో కాల్ లేకుండా పంపిణీ చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.
Kishan Reddy : మీ నుండి బాప్-బేటా పాలన నేర్చుకోవాలా
అయితే. కొన్ని రోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఒకవేళ మారాల్సి వస్తే అందరిని ఒప్పించి… సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మునుగోడులో పోటీ చేయలా వద్దా అనేది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అయినా ఎంపీగా వచ్చిన మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు.