ఐపీఎల్ 2022 సీజన్ జోష్ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో ఈ మ్యాచ్‌కు రికీ పాంటింగ్ […]
వేసవికాలం తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భానుడి ప్రతాపానికి వేసవికాలం ప్రారంభం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు. ఉదయం 9 నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలపై వరుణుడు నిన్న కరుణించి వర్షం కురిపించడంతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ రోజుల కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో […]
నిజామాబాద్ టీ-హబ్ ను అమెరికాకు చెందిన వైటల్ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధుల, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు బిగాల మహేష్ గుప్తా, ఎమ్మెల్యే బిగాల గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా బిగాల గణేష్ మాట్లాడుతూ.. టీ-హబ్ ను అమెరికాకు చెందిన ప్రతినిధులు సందర్శించారని, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ హబ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని, హైదరాబాద్, […]
మహబూబాబాద్ కౌన్సిలర్ రవిని హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యతో సంబంధం ఉన్న 7గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురు వారికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్‌లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు. వారి నుండి మారునాయుధాలు గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారును […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 9వ రోజు కొనసాగుతోంది. అయితే పాదయాత్ర వద్ద డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు పాదయాత్ర చేపట్టడంతోనే ఆర్డీఎస్ సమస్యను పరిష్కారించిన ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దక్కుతుందన్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయడం వల్లనే జరిగిందని మోసపూరిత మాట్లాడటం సరిగదాని కర్నూలు, పోలీసులతో అలంపూర్, గద్వాల రైతులు యుద్దవాతవరణం […]
స్థానిక మంత్రి పోలీసులపై తీసుకొని వచ్చిన ఒత్తిడి కారణంగా సాయి గణేష్ వాంగ్మూలం రికార్డ్ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఖమ్మం సంఘటన అందుకు అద్దం పడుతుందని, తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రైతు బంధు […]
నిన్న వరంగల్‌లో రాహుల్ గాంధీ పర్యటన, రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో సభస్థలాన్ని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. రేవంత్ రెడ్డికి నోటి తీట ఎక్కువ అయ్యిందని, తీట తీరుస్తాం అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యంత బ్లాక్ […]
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో వరంగల్ పర్యటన, రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో నిన్న వరంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా శవయాత్ర […]
ఐపీఎల్ 2022 సీజన్లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నేడు ముంబాయిలోని డీవై పాటేల్ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఎంతో ఉత్కంఠ నడుమ సీఎస్కే విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రెండు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్ మతి తప్పిందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందని, హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని ఆయన అన్నారు. ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని […]