కృష్ణా జిల్లా బందరు మత్స్యకారులు గల్లంతై ఇవాళ్టీకి మూడో రోజులు కావస్తుంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి. అయినప్పటకీ ఇంకా వారి ఆచూకీ లభించలేదు. దీంతో.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం బయలుదేరిన వాళ్లు.. తాము చిక్కుకున్నామని బోట్ రిపేర్ అంటూ ఆదివారం కుటుంబ సభ్యులకు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. అంతర్వేది సమీపంలో చిక్కుకున్నట్టు మత్స్యకారుల తెలిపారు. దీంతో రిపేర్ చేసేందుకు వేరే బోటులో అంతర్వేదికి వెళ్లినా మత్స్యకారులు కనిపించలేదు. ఏడాదిలో ఎడెనిమిది నెలలు వేటకు వెళ్తారని…ఇలా ఎప్పుడూ జరగలేదంటూ కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. కాసేపట్లో మరో రెండు బోట్లల్లో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. బందరు నుంచి మూడు బోట్లల్లో మెరైన్ పోలీసులు, బోటు ఓనర్ సహా గ్రామస్తులు వెళ్లనున్నారు. బోటు ఆగిన అంతర్వేది ప్రాంతానికి బోట్లు వెళ్లనున్నాయి.
ఈ సందర్భంగా బోటు ఓనర్ బలగం కొండలు మాట్లాడుతూ.. బోటు ఆగినట్టు ఆదివారం నాకు సమాచారం అందించారని, మర్నాడు అంతర్వేది సమీపానికి వెళ్లాను.. అక్కడి నుంచి మరింత ముందుకెళ్లినా ఆచూకీ లభించలేదన్నారు. ఇంజన్‌లోకి నీళ్లు వెళ్లి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి వచ్చిన బోటులో మత్స్యకారులు కొంత ఆయిల్ ఇచ్చి సాయం చేశారని, తెర చాప లేకుండా ఇంత దూరం ఎందుకు వచ్చారని గల్లంతైన వాళ్లని కాకినాడ మత్స్సకారులు హెచ్చరించారని, తమను తీసుకెళ్లమని కాకినాడ మత్స్యకారులను కోరినా వాళ్లకున్న ఇబ్బంది కారణంగా సహకరించ లేదని మత్య్సకారులు సమాచారం అందించినట్లు బలగం కొండలు తెలిపారు. ఈ తరహాలో బోటు ఎప్పుడు మిస్ కాలేదన్న ఆయన.. బోట్ మిస్ అయిన వెంటనే సమాచారాన్ని మెరైన్ పోలీసులకు చేరవేశానన్నారు.