టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలోని జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు రాజయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. నేడు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు బెంగుళూరుకు చంద్రబాబు చేరుకోనున్నారు. బెంగుళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా మదనపల్లి చంద్రబాబు చేరుకుంటారు. చంద్రబాబుకి కర్ణాటక-ఏపీ సరిహద్దులో ఘన స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు రెడీ అయ్యారు.
ఏపీ సరిహద్దు నుండి తెలుగు యువత భారీ బైక్ ర్యాలీల ఏర్పాటు చేసింది. అయితే.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేబట్టి, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు మార్గనిర్దేశం చేయనున్నారు. దీనికితోడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు పార్టీ అధినేత పర్యటనల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.