ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ నెల 14న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలోని ఆయన ప్రసంగిస్తారు. అయితే.. ఈ మేరకు సభ విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు జనసమీకరణ చేస్తున్నాయి. అంతేకాకుండా సభా ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే గురువారం సభా ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, […]
మద్యం కిక్కు నిషా నశాలనికి ఎక్కితే.. మేము చేసేదే రైట్.. మేము పోయేదే రూట్.. అడ్డొస్తే లైట్.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు మందుబాబులు.. పీకల దాక మద్యం సేవించి నిర్లక్ష్యంగా రోడ్లపై వాహనాలు నడుపుతూ.. అడ్డొచ్చిన వారిపైకి కూడా కార్లను ఎక్కించేస్తున్నారు. యమ స్పీడ్‌తో రయ్..రయ్‌మంటూ రోడ్లపై అడ్డొచ్చిన వారిని ఢీ కొట్టి.. లైట్ తీసుకో అంటూ వెళ్లిపోతున్నారు. భాగ్యనగరంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అయితే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. కొండాపూర్ మసీద్ బండలో మందుబాబుల […]
అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇప్పటికే ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కానీ.. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీం కింద కేంద్రంను అనుమతులు కోరింది ఫోర్డ్. అయితే.. ఇటీవలే ఫోర్డ్ పీఎల్ఐ అప్లికేషన్‌కు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫోర్డ్ మళ్లీ ఇండియాలో కార్ల ఉత్పత్తి కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ […]
భోజనాల వద్ద చెలరేగిన వివాదం.. వివాహ వేడుకల్లో వరుడు తరుపు బంధువులపై దాడి జరిగేంత వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండా గ్రామంలోని ఓ యువతికి మహబూబాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో వరుడు తరుపు బంధువులు భోజనాల వద్దకు వచ్చారు. అక్కడ వరుడు తరుపు వారికి, వధువు తరుపు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్తా.. చిలికిచిలికి […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈ నెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో భారీగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో… బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు.. సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా జనసమీకరణ చేస్తున్నాయి. ఇటీవలే కార్యకర్త […]
ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు కోసం ఉద్యోగుల వేతనాలనుండి 2 శాతం చందా చెల్లిస్తామని టీఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారపత్రం ఇవ్వడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసి) స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. 2 శాతం చందా అంగీకారం కాదని, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కోరింది. సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యత పూర్తిగా ఆయా […]
పొరుగు దేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. పాలక రాజపక్స కుటుంబంపై ప్రజలు తిరుగుబాటు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక దుస్థితికి రాజపక్సలే కారణం అంటూ గత కొన్ని నెలలుగా లంక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. నిరుద్యోగం, అధిక ధరలు, విద్యుత్ కోతలు, ఇందన కొరత, నిత్యావసరాల లేమితో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ప్రజలు ఒక్కసారిగా పాలకవర్గం మీద తిరగబడ్డారు. వీధుల్లోకి వచ్చి నిరసనల ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల […]
నల్లమల్ల అభయారణ్యం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెలతీర్థం జలపాతం వద్ద వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది.. స్థానిక ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందినా సాయి తేజ చెడు అలవాట్లకు బానిసై, తనను పెంచిన తల్లి భూలక్ష్మిని ఈ నెల 6వ తేదీన అతికిరాతకంగా హతమార్చాడు.. అంతేకాకుండా.. ఇంట్లో సొమ్ములు, డబ్బులు తీసుకొని అతని స్నేహితుడు వట్టికోట శివతో కలిసి 10వ తేదీన శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో నాగర్ […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దళిత బంధు పథకం. అయితే లబ్దిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి రూ.10 లక్షలు జమ చేసే ఈ పథకంలో పొరపాటు జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు నిధులను రంగారెడ్డి జిల్లా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లకిడికపూల్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే.. బ్యాంక్ క్లరికల్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లో కి సొమ్ము జమ కావడంతో బ్యాంక్ అధికారులు […]
పరిచయం లేనివారితో స్నేహం చేయడం.. అన్నీ వారితో పంచుకోవడం ఎప్పటికైనా ముప్పే.. అలాంటి ఘటనే ఇది.. మీర్పేట్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉండే శ్వేతారెడ్డి అనే మహిళకు ఫేస్బుక్లో మల్కారం యాష్మ కుమార్ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే శ్వేతారెడ్డి, యాష్మకుమార్లు న్యూడ్ వీడియో కాల్స్ చేసుకునే వారు. అయితే ఆ సమయంతో న్యూడ్ కాల్స్‌ను యాష్మ కుమార్ రికార్డ్ చేశాడు. అయితే కొన్ని రోజులుగా యాష్మకుమార్ […]