BJP National Vice President D.K Aruna Fired On CM KCR.
తెలంగాణలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రెండు దఫాలుగా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని యాదాద్రి భువనగిరి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రిలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. రెండు దశల ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి అయ్యే సరికి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులను విమర్శిస్తున్నారని, బీజేపీ నేతలను తిడితే.. పార్టీ ఎదుగుదల ఆగదని ఆమె అన్నారు.
Etela Rajender : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు
బంగారు గడ్డపై ఏ ఒక్కరికి అయినా రెండు పడకల ఇల్లు దక్కిందా అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నారని, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని, యాదాద్రి నరసింహ స్వామినే మోసం చేసే ఘనుడు కేసీఆర్ అంటూ ఆమె విమర్శించారు. యాదాద్రి ఆలయం చూస్తే కన్నీళ్లు వచ్చాయని, 150 కుటుంబాలను కేసీఆర్ మోసం చేశారని, 150 కుటుంబాలను రోడ్డుపై పడేయమని నరసింహ స్వామి చెప్పారా అని ఆమె మండిపడ్డారు. యాదాద్రి పేరుతో వందల కోట్ల ధనాన్ని మింగారు అంటూ ఆమె ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.