నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం దేవక్కపేట్ గోనుగొప్పుల గ్రామాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని బండి సంజయ్ అమిత్ షా ను అడగాలన్నారు. పాదయాత్రలో కర్ణాటక ప్రజలు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు కావాలని బండికి వినతి పత్రం ఇచ్చారు. నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మీటింగ్ […]
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అది కూడా బడ్జెట్ ఫోన్ గురించి చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ముందు వరుసలో ఈ ఫోన్ ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్లను పొందుపరిచిన ఫోన్లను అందిస్తున్న ఒప్పొ తమ వినియోగదారుల కోసం ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ఒప్పొ రెనో 5 ప్రో 5జీ లేదా స్టైలిష్ ఒప్పొ F19 ప్రో + 5జీ వంటి వాటితో పాటు.. ఒప్పొ A74 5G మోడల్స్‌ను ఇప్పటికే […]
రోజురోజు బంధాలు, బాంధవ్వాలంటే ఎవ్వరికీ లెక్కలేకుండా పోతోంది. నిండినూరేళ్లు కట్టుకున్న వాడితో ఉంటానని ప్రమాణం చేసిన ఓ భార్య.. వివాహేతర సంబంధం మోజు పడి.. భర్తనే కాటికి పంపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామంలో గత నెల 22న యూనుస్ (34) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. యూనుస్ తండ్రి ఇమాసాబ్ కొడుకు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో […]
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు పాలకుర్తి నియోజకవర్గములో సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్లు తదితర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కిరికిరి చేష్టలు, బోగస్ మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని పాలించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ చేసింది ఏమీ లేదని, […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న అమిత్ షాకు 20 మంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కొత్తగా సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్ […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదితో బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ… కేటీఆర్.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్దపడు అంటూ సవాల్ విసిరారు. తాను ప్రజల తరపున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు […]
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా.. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును ఆర్సీబీ ముందు పెట్టారు. 60 పరుగుల […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో రేపు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు […]
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి తల్లి కొడుకుల ఆత్మహత్య కేసులో నిందుతులకు బెయిల్ మంజురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొందరు వ్యక్తుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, అతడి తల్లి పద్మ కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 18 నెలలుగా 7గురు వ్యక్తులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పిన సంతోష్..వారి పేర్లను కూడా వెల్లడించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును […]