CP Stephen Raveendra : ట్రేడింగ్ అంటూ.. అమాయకులకు టెండర్.. 9 కోట్లు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో భారీ ఆపరేషన్ నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల ద్వారా కొట్టేసిన డబ్బులతో వ్యాపారాలు చేస్తూ.. బిజినెస్మెన్లుగా కొనసాగుతున్నారు సైబర్ కేటుగాళ్లు. జంట నగరాల్లో వేల మంది నుంచి కోట్ల రూపాయలను కొట్టేసింది ఈ ముఠా. అయితే.. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. మార్కెట్ బాక్స్ అని ట్రేడింగ్ యాప్ ద్వారా అమాయకులను మోసం చేశారని వెల్లడించారు. రాజస్థాన్,యూపీ కి చెందిన నలుగురు సైబర్ నేరగాళ్ల ను అరెస్ట్ చేసామని, పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో ఈ సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొట్టినట్లు సీపీ వెల్లడించారు.
Also Read
- Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
- All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
- Maharashtra: RSS ర్యాలీ, రాళ్లదాడి.. మహారాష్ట్ర జల్గావ్లో ఉద్రిక్తత.!
- 2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
నలుగురు నిందితుల నుంచి రూ.9 కోట్ల 81 లక్షల నగదు రికవరీ చేసామని, ఇంత పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్ల నుండి డబ్బు రికవరీ చేయడం దేశంలోనే మొదటి సారి అని ఆయన వివరించారు. సైబర్ నేరగాళ్లు అభిషేక్ జైన్ , పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాష్ రాయ్, కృష్ణ కుమార్ లను అరెస్ట్ చేసామని, యాప్ ను అభిషేక్ జైన్ డెవలప్ చేశాడని, ఈ యాప్ సెబీలో రిజిస్టర్ చేసుకోలేదన్నారు. ఇప్పటివరకు ఈ యాప్ లో 3000 మంది ట్రేడర్స్ రిజిస్టర్ చేసుకున్నారని, ‘ Market Box/MB’ , www.marketbox.in పేరుతో ట్రేడింగ్ అప్లికేషన్ ను తయారు చేసి..వాట్సాప్ , టెలిగ్రాం యాప్ ల ద్వారా ప్రమోట్ చేసినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అయితే.. ప్రజలు ఇలాంటి యాప్‌లతో మోసపోవద్దని, అన్ని విషయాలను తెలుసుకోవాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. సైబర్ నేరగాళ్ల గురించి తెలుసుకోవడం ఎంతైన ఉత్తమం.
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?