Jagadish Reddy : రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇస్తూ… ఏపీకి ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ.. ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యే.. తెలంగాణాప్రభుత్వంపై కేంద్రం కక్ష్యపూరితంగా వ్యవరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీ నుండి రావాల్సిన 12,900 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదని ఆయన వెల్లడించారు. విద్యుత్ తోపాటు, బకాయిలు, పీపీఏ లలోను తెలంగాణకు ఏపీ నష్టమే చేసిందని ఆయన తెలిపారు. ఒక్కరోజు కుడా కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన ఆరోపించారు. 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదని, గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందన్నారు. దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు, ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణా లోనేనని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బీజేపీ సర్కార్ జీర్ణించుకోలేక పోతుందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఆందుకే బీజేపీ సర్కార్ కు కంటగింపుగా ఉందని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుందని ఆయన దుయ్యబట్టారు. అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదని, ఏపీ నుండి రావాల్సిన 12,941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందని, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని, నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమేనన్నారు. జాతీయ ప్రభుత్వంగా చేయాల్సింది ఇది కాదని, తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టను అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, కేంద్రానికి ఏపీ లేఖలే కనిపిస్తున్నాయని, తెలంగాణా లేఖలు మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!