Womens World Cup 2025 : స్మృతి మంధాన రికార్డ్.. 5 వేల పరుగులు పూర్తి
- 5 వేల పరుగులు చేసిన స్మృతి మంధాన
- 5 వేల పరుగులు చేసిన రెండో మహిళా భారత బ్యాటర్ మంధాన
- అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డ్
- 112 ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగులు చేసిన స్మృతి మంధాన
- ఆస్ట్రేలియాపై 10 హాఫ్ సెంచరీలు చేసిన స్మృతి మంధాన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
మంధాన ఈ రికార్డును అత్యంత వేగంగా అందుకోవడం విశేషం. కేవలం 112 ఇన్నింగ్స్‌లలోనే 5 వేల పరుగులు పూర్తి చేసి భారత మహిళా క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె ఆస్ట్రేలియాపై ప్రత్యేకమైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై మొత్తం 10 హాఫ్ సెంచరీలు సాధించిన మంధాన, కంగారూ బౌలర్లను వరుసగా సమర్థవంతంగా ఎదుర్కొంటూ టీమిండియాకు బలాన్నిస్తోంది.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
ఆమె ప్రదర్శనతో భారత జట్టు వరల్డ్‌కప్‌లో మంచి ఊపునందుకుంది. స్మృతి మంధాన రికార్డు సాధించిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు, క్రికెట్ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. టీమిండియాకు మంధాన లాంటి ఆటగాళ్లే గొప్ప గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. మహిళా క్రికెట్ ప్రపంచంలో కొత్త మైలురాయిల దిశగా స్మృతి మంధాన దూసుకెళ్తుండటం భారత అభిమానులకు గర్వకారణంగా మారింది.
Principal Assaults YouTuber: యూట్యూబర్ పై మహిళ ప్రిన్సిపాల్ దాడి…ఎందుకంటే…
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?