RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సూర్యకి తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం సూర్య చేతిలో కంగువా, వాడీ వసూల్ సినిమాలు ఉన్నాయి.
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికను మనోజ్ ప్రేమించి, గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ చెప్పుకొచ్చాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎలాంటి స్నేహ బంధం ఉందో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా కూడా వీరి స్నేహానికి ఉండే ఫ్యాన్ బేస్ వేరు అని చెప్పాలి. ఇక మాటల మాంత్రికుడు.. పవన్ కు రాజకీయంగా కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు.
Chandini Chowdary: తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని 'కలర్ ఫోటో' చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది.
Varalaxmi Sarathkumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా అవి సెట్ అవ్వకపోయేసరికి అమ్మడు విలనిజం మీద పడింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బక్కచిక్కి స్టార్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండిస్తూ వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్న వరూ .. ఈ మధ్యనే ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్ తో నిశ్చితార్థం…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కుమారుడే అని న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయ్యింది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి జీవితాల్లో ఏది జరుగుతుంది అనేది ముందుగానే అంచనావేసి చెప్తూ ఉంటాడు. అసలు సమంత- నాగ చైతన్య విడాకులు తీసుంటారని చెప్పినప్పుడు వేణుస్వామి ని ఒక్కరు కూడా నమ్మలేదు.