Manchu Manoj: మనోజ్ భార్య సీమంతం.. మంచు కుటుంబం లేకుండానే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. భూమా మౌనికను మనోజ్ ప్రేమించి, గతేడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మధ్యనే బాబు బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఇక మౌనిక తల్లి కాబోతుందని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరూ కూడా మీడియా ముందు కనిపిస్తూనే ఉన్నారు. వీరికి కవలలు అని వస్తున్న వార్తలను కూడా వారు ఖండించిన విషయం తెల్సిందే.
ఇకపోతే తాజాగా భూమా మౌనిక సీమంతం ఎంతో సింపుల్ గా జరిగింది. ఆళ్లగడ్డలోని తన పుట్టింటిలో మౌనిక సీమంత వేడుకలు ఎంతో సింపుల్ గా జరిగాయి. మనోజ్.. తన భార్యకు దగ్గర ఉండి సీమంతం జరిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ వేడుకలో మంచు కుటుంబం కనిపించకపోవడం గమనార్హం. చివరికి వీరికి పెళ్లి చేసిన మంచు లక్ష్మీ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. మొదటి నుంచి వీరి పెళ్ళికి మంచు కుటుంబం సుముఖత చూపించలేదని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, పెళ్ళిలో మోహన్ బాబు.. మౌనిక కూడా తన కూతురే అని చెప్పడంతో వీరు కలిసిపోయారు అనుకున్నారు. కానీ, మనోజ్.. మంచు కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి తరువాత కూడా మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం విష్ణు.. కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మంచు కుటుంబం ఈ సీమంతానికి వెళ్ళారా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!