Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. సెలబ్రిటీల జాతకాలను బట్టి వారి జీవితాల్లో ఏది జరుగుతుంది అనేది ముందుగానే అంచనావేసి చెప్తూ ఉంటాడు. అసలు సమంత- నాగ చైతన్య విడాకులు తీసుంటారని చెప్పినప్పుడు వేణుస్వామి ని ఒక్కరు కూడా నమ్మలేదు. నాలుగేళ్ళ తరువాత వారిద్దరూ విడాకులు తీసుకున్నప్పుడు.. నేను చెప్పానే.. చెప్పానే అంటూ మర్యాద రామన్నలో సునీల్ డైలాగ్ చెప్పుకొచ్చాడు. ఇక అప్పటినుంచి వేణుస్వామి ఏది చెప్పినా.. అందులో నిజం ఉందా.. ? అని అభిమానులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒక్క సమంత విషయంలో ఈయన చెప్పింది జరగడంతో.. మిగతా అన్ని విషయాల్లో జరుగుతుందని కొంతమంది నమ్ముతూ వచ్చారు. అయితే ఈ ఏడాదిలో వేణుస్వామి చెప్పింది ఏది జరగకపోవడంతో ప్రతిఒక్కరు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇండియా వరల్డ్ కప్ ఈ ఏడాది కొడుతోంది అని చెప్పుకొచ్చాడు.. అది జరగలేదు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతాడు అని చెప్పుకొచ్చాడు.. అది కూడా జరిగింది లేదు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. కొన్నిరోజుల క్రితం ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి చెప్పిన మాటలు ఇండస్ట్రీని షేక్ చేసాయి. ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని, హిట్లు ఉండవని, ప్రభాస్ పనిపోయిందని చెప్పుకొచ్చాడు.. అంతేకాకుండా పెళ్లి యోగం కూడా లేదు అని చెప్పాడు. ఆ సమయంలోనే సలార్ రిలీజ్ అవ్వడం.. భారీ హిట్ అందుకోవడంతో ఈసారి కూడా వేణుస్వామి తప్పులో కాలేశాడు అనుకున్నారు. అంతేనా ప్రభాస్ కు ఒక్క హిట్ ఉండదు.. పనైపోయింది అన్నావ్ కదరా.. ఇప్పుడు చెప్పు అంటూ ట్రోల్ కూడా చేశారు. అయితే.. అనుకోనివిధంగా కొన్ని ఏరియాల్లో సలార్ విజయాన్ని అందుకోలేదు. నార్త్ ఇండియాలోని అన్ని ఏరియాల్లో సలార్ నష్టాలను చవిచూసింది.నష్టాలను చవిచూసిన డిస్ట్రిబ్యూటర్లకు సలార్ నిర్మాత డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశాడు. ఇక ఈ విషయాన్నీ వేణుస్వామి సోషల్ మీడియాలో అధికారికంగా చెప్పుకొచ్చాడు.. నేను ముందే చెప్పానే అంటూ ఒక మీమ్ తో తెలిపాడు. ఇక ఇది చూసిన అభిమానులు ఆమ్మో.. ప్రభాస్ కెరీర్ గురించి చెప్పింది నిజం అయితే ఆయన పెళ్లి గురించి చెప్పింది కూడా నిజమవుతుందా.. ? ప్రభాస్ కు ఇక పెళ్లి జరగదా.. ? అని భయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.