గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రానున్న ఈ సినిమా నుంచి ‘యుగ యుగమైన తరగని వేదన’ అనే పాటను విడుదల చేసింది యూనిట్. తాము విడుదల చేసిన ముందు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంటుందంటున్నారు నిర్మాతలు. అన్ని […]
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా అధిగమించి బయటపడ్డాడన్నదే కథాంశం. శ్రీరామ్ మడ్డూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఆరంభం అయింది. యస్ […]
తెలుగు సినీ చరిత్రలో జానపద చిత్రాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు విఠలాచార్య. జానపద బ్రహ్మగా సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న చరిత్ర ఆయన సొంతం. టాప్ స్టార్స్ నుంచి న్యూ స్టార్స్ వరకూ ఆయన చేసిన సినిమాలన్నీ విఠలాచార్య చిత్రాలుగానే గుర్తింపు పొందాయి. ఆయనపై సగటు సినీ ప్రేక్షకుడికి ఉన్న గౌరవం అది. దశాబ్దాలుగా సినీ ప్రేమికులు ఆదరిస్తూ వచ్చిన విఠలాచార్య సినిమా స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆయన మూవీ జర్నీని నవతరానికి సమగ్రంగా పరిచయం చేస్తున్నాడు సీనియర్ జర్నలిస్ట్, […]
నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షో.. అన్ స్టాపబుల్ గా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన రెండు ఎపిసోడ్లు అల్టిమేట్ రేటింగ్ తెచ్చుకున్నాయి. బాలకృష్ణ పంచ్ లు, జోకులతో షో అంతా దద్దరిల్లింది. మొదట మోహన్ బాబు, ఆ తరువాత నానితో బాలయ్య రచ్చ రచ్చ చేశారు. ఇక మూడో ఎపిసోడ్ లో బాలయ్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే ఆహా వారు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే తాజాగా అందుతున్న […]
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి.. ఇంట్లో కట్టుకొన్నవారితో గొడవలు పరాయి వారిని దగ్గరకు చేర్చుతున్నాయి. ఇంట్లో దొరకని సుఖం బయట దొరుకుతుందని ఆవేశపడి కట్టుకున్నవారిని మోసం చేసి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఒక భార్య భర్తతో గొడవలు పడలేక మరొక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఇక ఈ విషయం తెలిసిన భర్త కోపంతో ఊగిపోతూ భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాలో […]
అక్కినేని నాగ చైతన్య- సమంత విసకుల తరువాత సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జువాల్కర్ పేరు మారుమ్రోగింది విషయం తెలిసిందే.. అతని వలనే వారిద్దరూ విడిపోయారని కొందరు.. సామ్ కి ప్రీతమ్ లేనిపోనివి కల్పించి చెప్పాడని మరికొందరు రూమర్స్ పుట్టించారు. ఇక వాటికి ఆజ్యం పోస్టు ప్రీతమ్ కూడా ఇన్ డైరెక్ట్ గా సామ్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టాడు. దీంతో చై అభిమానులు అతడిని ఆడేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సమంత తనదైన శైలిలో రియాక్ట్ […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమానే ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని వర్మ ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు. ట్రైలర్ మొత్తం రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం మద్యంలో వర్మ కిడ్నాప్ అవ్వడం.. దానివలన జరిగే పరిణామాలు ఏంటి అనేది చూపించాడు. ఒక్క సీటు కూడా రాలేదా అంటూ ప్రవన్ […]
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరిస్ లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష నర్రా హీరోగా పరిచయమైన సినిమా ‘మిస్సింగ్’. ఇదే సినిమాతో శ్రీని జోస్యుల సైతం దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించిన ‘మిస్సింగ్’ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నికీషా రంగ్వాలా)ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తొలుత శ్రుతి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెళ్ళికి […]
తమకు అచ్చి వచ్చిన సినిమాల పేర్లనే ఇంటిపేరుగా మార్చుకొని రాణించిన వారెందరో ఉన్నారు. ‘శుభలేఖ’ సుధాకర్ కూడా అచ్చంగా అలాంటివారే! ఒకప్పుడు రివటలా ఉండే ‘శుభలేఖ’ సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ […]
జీనత్ అమన్.. ఈ పేరు 1970లలో ఎంతోమంది సరసులకు ఓ మంత్రం! జీనత్ పేరే జపిస్తూ ఆమె అందాలను ఆరాధిస్తూ, తెరపై ఆ శృంగార రసాధిదేవతను చూసి, ఆమెను తమ స్వప్న సామ్రాజ్యాలకు మహారాణిగా పట్టాభిషేకం చేసుకున్నారు. అలాంటి వారు ఈ నాటికీ ఆ నాటి జీనత్ అందాలను తలచుకుంటూ మురిసిపోతున్నారు. జీనత్ కు 70 ఏళ్ళు నిండాయంటే వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆమె చాలా రోజుల క్రితమే ముసలి పాత్రల్లోకి ఎంటరై పోయింది. అయినా, అభిమానులు […]