గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రానున్న ఈ సినిమా నుంచి ‘యుగ యుగమైన తరగని వేదన’ అనే పాటను విడుదల చేసింది యూనిట్. తాము విడుదల చేసిన ముందు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంటుందంటున్నారు నిర్మాతలు.
అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. చిత్ర పరిశ్రమకు ఇలాంటి నిర్మాతల అవసరం ఎంతో ఉందని, ఏది అడిగినా కాదనకుండా తెలుసుకుని వెంటనే కావలసిన ఏర్పాట్లు చేసే ఈ నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు తీయాలని దర్శకుడు క్రాంతి చెబుతున్నారు.