Heeramandi: ఓటమి అంటే ఏంటో ఎరుగని దర్శకుడు.. వంద కోట్ల క్లబ్ లో ఎక్కువసార్లు నిలిచిన డైరెక్టర్.. సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తీసిన సినిమా ఏదైనా ఒక కళా ఖండమే. ఆయనతో పనిచేయాలని స్టార్ హీరో హీరోయిన్లు తహతహలాడుతుంటారు.
Alia Bhatt: సెలబ్రిటీల గురించి, వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వారి పిల్లలను చూడడానికి, వారు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.
Akhil Akkineni: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని వెండితెరపై కనిపించిందే లేదు. ఇక ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
Venkatesh: విక్టరీ వెంకటేష్ కు ఫ్యాన్స్ వార్ ఉండవు.. ఆయన అంటే అందరికి అభిమానమే.. టాలీవుడ్ మొత్తానికి ఆయనే వెంకీ మామ. ప్రస్తుతం వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్ కానుంది.
R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్న సమస్యలను ఆయన చిత్రాల ద్వారా ఎండగడుతూ ఉంటారు. ప్రభుత్వాల వలన, దళారుల వలన రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఆయన సినిమాలు ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరాలు మారినా.. తారలు మారినా.. ఆమె అందం, ఆమె అభినయం ఎప్పటికీ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి.
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి నేపోటిజం అన్నా.. నెపో కిడ్స్ అన్నా పట్టరాని కోపం అన్న విషయం అందరికి తెల్సిందే. కొద్దిగా ఛాన్స్ దొరకడం ఆలస్యం వారికి ఏకిపారేయడంలో ముందు ఉంటుంది.
Sobhita Dhulipala: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నది సామెత. కానీ.. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల మాత్రం రచ్చ గెలిచి ఇంట గెలవడానికి ప్రయత్నిస్తోంది. సాధారణంగా తెలుగు హీరోయిన్స్ ఎవరైనా ముందు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నాక బాలీవుడ్ కు వెళ్లారు.. కానీ శోభిత మాత్రం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.
Kasturi: పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు.. ఈ సాంగ్ ను తెలుగువారు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ వీడియోలో ఉన్న కస్తూరిని కూడా అంత త్వరగా మర్చిపోలేరు.