Self-Employment: ఏ బిజినెస్‌ను ప్రారంభించినా ఎంతో కొంత మందికి ఎంప్లాయ్‌మెంట్ అందుబాటులోకి వస్తుంది. కానీ.. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలనేదే తన లక్ష్యమని డిజిటల్ మార్కెటర్ వీరేందర్ చౌదరి అన్నారు. ఈయన ఫేస్‌బుక్ యాడ్స్ ఎక్స్‌పర్ట్‌గా, సేల్స్ ట్రైనర్‌గా రాణిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఏడేళ్ల అనుభవం కలిగిన ఈయన వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు తమదైన కెరీర్‌ని సొంతం చేశారు. డిజిటల్ మార్కెటింగ్‌లోని అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఒక మాడ్యూల్ గురించి వివరించారు. ఉదాహరణకు.. ఒక కస్టమర్ అమేజాన్ వెబ్‌సైట్‌లోకి వచ్చి ఒక ప్రొడక్ట్‌ను కొనటానికి(అమేజాన్‌వాళ్లు ఒక కొత్త కస్టమర్‌ని అక్వైర్ చేయటానికి) 8 వేల రూపాయలు ఖర్చుపెడతారు.
ఆ ప్రొడక్ట్ ఖరీదు 10 రూపాయలు కావొచ్చు.. 20 రూపాయలు కావొచ్చు. దాన్ని ఒక వినియోగదారుడి చేత కొనిపించాలంటే అమేజాన్‌కి అయ్యే ఖర్చు(యాడ్స్ రూపంలో కావొచ్చు.. ఇతరత్రా మార్గంలో కావొచ్చు) అక్షరాలా ఎనిమిది వేల రూపాయలు. అదే.. అఫిలియేట్ మార్కెటింగ్‌లో అయితే ఆ 8 వేల రూపాయల్లోని సగం ఖర్చుతోనే(రూ.4 వేల తోనే) ఆ ప్రొడక్ట్‌ను అమ్మొచ్చు. తద్వారా.. అమేజాన్‌కి రూ.4 వేలు మిగులుతాయి. అఫిలియేట్ పర్సన్‌కి(మార్కెటింగ్ చేసి పెట్టే వ్యక్తికి) రూ.4 వేలు వస్తాయి. ఈ విధంగానే ఈ రోజుల్లో స్టూడెంట్స్ డబ్బు సంపాదిస్తున్నారు. అమేజాన్ లాంటి 81 శాతం బిగ్ బ్రాండ్స్ అన్నీ ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఆధారంగానే సేల్స్ చేస్తున్నాయి.