Stock Market Fundamental Analysis: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయని, అవి.. 1. క్వాలిటేటివ్ 2. క్వాంటిటేటివ్ అని గత వారం చెప్పుకున్నాం. ఈ వారం టెక్నికల్ అనాలసిస్ గురించి తెలుసుకుందాం. టెక్నికల్ అనాలసిస్ అంటే చాలా కష్టంగా ఉంటుందేమోననే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటిని ఇవాళ నివృత్తి చేసుకుందాం. ఉదాహరణకు మనం ఒక స్టాక్‌ను సెలెక్ట్ చేసుకున్నాం. అది మంచి కంపెనీకి సంబంధించింది. అయితే.. దాన్ని ఏ స్థాయిలో కొనాలి? అనేది వంద డాలర్ల ప్రశ్న.
స్టాక్‌ని ఏ వ్యాల్యూ వద్ద కొనాలి? ఏ విలువ వద్ద అమ్మాలి? అనేది తెలుసుకోవటానికి ఉపయోగపడేదే టెక్నికల్ అనాలిసిస్. ఈ సాంకేతిక విశ్లేషణలో ఒక డేటా ఇచ్చినప్పుడు అందులో స్టాక్స్ రేట్లు గతంలోను మరియు ప్రస్తుతం ఏవిధంగా మారుతున్నాయో అంత తేలిగ్గా అర్థంకాదు. అదే సమాచారాన్ని చార్ట్‌ల రూపంలో గానీ గ్రాఫ్‌ల రూపంలో గానీ ఇస్తే ఇన్వెస్టర్లకు ఈజీగా అవగాహన వస్తుంది. మార్కెట్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్‌కి వెళ్లిందో క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. అప్పుడు మనం స్టాక్ మార్కెట్‌లోకి మన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవల్స్‌ని నిర్ణయించుకోవచ్చు.
అయితే.. ఈ టెక్నికల్ అనాలసిస్‌లో కూడా ముందుగా తెలుసుకోవాల్సింది ట్రెండ్. ఇందులో ముఖ్యంగా మూడు ఉంటాయి. 1. అప్ ట్రెండ్ 2. డౌన్ ట్రెండ్ 3. కన్సాలిడేటెడ్. ఈ మూడింటిలో కన్సాలిడేటెడ్ అంటే స్టాక్స్ వ్యాల్యూస్.. సైడ్ వేస్‌లో ఒక రేంజ్‌లో మూవ్ అవుతుంటాయి. ఇలాంటి మరిన్ని, ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్ సీఈఓ ప్రసాద్ దాసరి గారి విశ్లేషణ వింటే సరిపోతుంది. ‘ఎన్-బిజినెస్’తో ఆయన చేసిన ‘ఫిన్ టాక్’ వీడియో లింక్ ఈ కిందనే ఉందని వ్యూవర్స్ గమనించగలరు.