PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బర్న్‌హామ్‌కు ప్రధాని మోడీ అభినందనలు తెలియజేస్తూ, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భారత్ – యూకే ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించే అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ‘ఎక్స్’ (X) ఖాతా ద్వారా వెల్లడించారు. భారత్, యూకే మధ్య ఇటీవల అమలులోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (Comprehensive Economic and Trade Agreement–CETA) ద్వారా లభించే అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులు మరింత విస్తరించడంతో పాటు ఇరు దేశాల ప్రజలకు కొత్త ఆర్థిక అవకాశాలు లభిస్తాయని మోడీ అభిప్రాయపడ్డారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
అదే విధంగా సాంకేతికత, ఆవిష్కరణ, రక్షణ, భద్రత, స్వచ్ఛ ఇంధనం, విద్య వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచేందుకు భారత్, యూకే కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వచ్ఛ ఇంధన రంగంలో ఉమ్మడి చర్యలు చేపట్టడంతో పాటు, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో రెండు దేశాల సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కూడా అంగీకారం కుదిరినట్లు సమాచారం. భారత్-యూకే మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరుదేశాల అగ్ర నాయకుల తాజా సంభాషణ మరింత ఊతమిస్తుందని, రానున్న రోజుల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారం కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
- Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
- Mohan Bhagwat: స్మిత్ మచ్చర్ హిందూ విలువలకు నిదర్శనం.. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు..
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
తాజావార్తలు
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!