5G Towers: వారానికి కనీసం 10 వేల 5జీ టవర్లను ఏర్పాటుచేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G Towers: టెలీకమ్యూనికేషన్ కంపెనీలు ప్రస్తుతం వారానికి 2 వేల 5 వందల 5జీ టవర్లను మాత్రమే ఏర్పాటుచేస్తుండగా ఆ సంఖ్యను వారానికి కనీసం 10 వేలకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇప్పటివరకు మొత్తం 8 వేల టవర్లను మాత్రమే ఇన్‌స్టాల్ చేశారని, 5జీ మౌలిక సదుపాయాల ఏర్పాటులో టెల్కోలకు ప్రభుత్వం నుంచి పాలసీకి సంబంధించిన ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే.. 5జీ roll-out స్పీడ్‌ను మాత్రం మెయిన్‌టెయిన్ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
also read: Indian Currency Look: మన దేశ కరెన్సీ లుక్ మారనుందా?
Also Read
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
టెలికం టవర్స్‌నే బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్ (బీటీఎస్) అని కూడా అంటారు. ఏ మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించిన బీటీఎస్‌లో అయినా ఫిక్స్‌డ్ రేడియో ట్రాన్సీవర్ ఉంటుంది. ఎక్కువ శాతం టవర్ల రూపంలోనే ఉంటుంది. ఇది సబ్‌స్క్రైబర్ డివైజ్ మరియు టెలికం ఆపరేటర్ నెట్‌వర్క్ మధ్య వైర్‌లెస్ కమ్యూనికేషన్ రాకపోకలకు వీలు కల్పిస్తుంది. ఇదిలాఉండగా.. 163 హ్యాండ్‌సెట్ మోడల్స్‌ని ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఎనేబుల్ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ముసాయిదా టెలికం బిల్లుపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు గతంలో విధించిన గడువును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పొడిగించొచ్చని తెలిపారు. ఈ లోపు ఇండస్ట్రీ వర్గాలు, సంఘాలు తమ తమ సలహాలను, సూచనలను ఆ తేదీ లోపు అందజేస్తే వాటిని పరిగణనలోకి తీసుకొని బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని చెప్పారు. సంబంధిత స్టాండింగ్ కమిటీ ఈ రికమండేషన్లను పరిశీలించి ముసాయిదా బిల్లులో పొందుపరుస్తుందని, అనంతరం మరో డాఫ్ట్ బిల్లును కూడా అందుబాటులోకి తెస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!