Real India: పెరుగుతున్న వడ్డీ రేట్లు మరియు ద్రవ్యోల్బణం వల్ల కొంత మందగమనం నెలకొన్నప్పటికీ.. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో మంచి పనితీరే కనబరిచిందని.. కొలియర్స్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు.. అంటే.. తొమ్మిది నెలల వ్యవధిలో.. మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు.. గతేడాదితో పోల్చితే 18 శాతం పెరిగి.. 3 పాయింట్ 6 బిలియన్ డాలర్లకు చేరాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో.. ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లోకి మూలధన ప్రవాహం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని కొలియర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఒకరు చెప్పారు. జోరుగా సాగుతున్న ఇళ్ల కొనుగోళ్లే ఈ ట్రెండ్‌కి నిదర్శనమని, దేశీయ పెట్టుబడిదారులు సైతం ఈ రంగంలో తమ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుతున్నారని వెల్లడించారు. జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చిన పెట్టుబడుల్లో 18 శాతం డొమెస్టిక్ ఇన్వెస్టర్లవేనని, ఇది.. పోయినేడాదితో పోల్చితే 4 శాతం ఎక్కువని నివేదిక పొందుపరిచింది.
read more: Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’
ఇదే సమయంలో.. గ్లోబల్ ఇన్వెస్టర్ల ఫండింగ్ యాక్టివిటీ పైచేయిగానే కొనసాగుతోందని, సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పందాల్లో వీళ్ల పార్టిసిపేషన్ ఎక్కువగా కనిపిస్తోందని కొలియర్స్ ఇండియా రీసెర్చ్ విభాగం సీనియర్ డైరెక్టర్ తెలిపారు. మరికొంత మంది ప్రపంచ పెట్టుబడిదారులు ఆర్థిక మాంద్యం ఒత్తిళ్లు కొనసాగినంత కాలం వేచి చూసే ధోరణి అవలంభిస్తారని అన్నారు. ఇదిలాఉండగా.. కమర్షియల్ ఆఫీస్ సెక్టార్‌లోకి కిందటేడాది కన్నా ఈసారి పెట్టుబడులు ఏకంగా 53 శాతం వృద్ధి చెందాయని ఆసియా పసిఫిక్ మార్కెట్ స్నాప్‌షాట్ Q3 రిపోర్ట్ పేర్కొంది.
ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో సుమారు సగం పెట్టుబడులు ఆఫీస్ సెక్టార్‌లోకే వచ్చాయి. దేశంలోని టాప్-6 నగరాల్లో ఆఫీస్ లీజింగ్ 50 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని దాటే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయితే.. ఈ ఆర్థిక సంవత్సరంలోని 4వ త్రైమాసికంలో ఆఫీస్ లీజింగ్ యాక్టివిటీ దాదాపుగా నిలిచిపోవచ్చని, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలే దీనికి కారణమని రిపోర్ట్ చెబుతోంది.