Today Stock Market Roundup 28-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని అద్భుతమైన ఫలితాలతో ముగించింది. చివరి రోజైన ఇవాళ శుక్రవారం రెండు కీలక సూచీలు అనూహ్యంగా అత్యధిక విలువలను అందుకోవటం విశేషం. విదేశీ మరియు స్వదేశీ కొనుగోళ్లు కలిసొచ్చాయి. రిలయెన్స్, ఐటీసీ, కొటక్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ వంటి సంస్థలు రాణించాయి.
Salary Hike: గతేడాది 78 శాతం మందికి మాత్రమే శాలరీ పెరిగింది. కానీ.. ఈ ఏడాది 90 శాతం మంది ఉద్యోగులు తమ వేతనం పెరగాలని కోరుకుంటున్నారు. కిందటి సంవత్సరం యావరేజ్‌గా 4 నుంచి 6 శాతం మాత్రమే శాలరీ హైక్ అయింది. ఈసారి మాత్రం కనీసం 4 నుంచి 6 శాతం పెరగాలని 20 శాతం మంది ఆశిస్తున్నారు.
Today Business Headlines 28-04-23: స్విగ్గీలో 10 వేల జాబులు: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ సంవత్సరం పది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ మేరకు అప్నా అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా నియమించుకునే ఉద్యోగులను తన ఇన్‌స్టామార్ట్ సర్వీసుల కోసం వాడుకోనుంది. ముఖ్యంగా టయర్ వన్, టయర్ టు సిటీల్లో ఈ రిక్రూట్మెంట్ చేపట్టనుంది.
Today Stock Market Roundup 27-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం చెప్పుకోదగ్గ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు క్రమంగా పెరిగాయి.
Land Rates in Hyderabad: విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్య నగరం.. అన్ని రంగాల్లో.. అన్ని వైపులా.. శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భూముల రేట్లు భారీగా పలుకుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు హైదరాబాద్‌లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొందనే టాక్ వినిపిస్తోంది.
Today Business Headlines 27-04-23: అత్యధిక.. పేటెంట్లు: గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పేటెంట్ ఫైలింగ్స్ సంఖ్య 13 పాయింట్ 6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం కావటం విశేషం. ఈ విషయాన్ని నాస్కామ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. డొమెస్టిక్ పేటెంట్ ఫైలింగ్స్ వాటా 41 శాతం నుంచి 44 శాతానికి పెరిగినట్లు పేర్కొంది.
Payment with Credit Card: విదేశీ యాత్రలకు వెళ్లేవాళ్లకి ముఖ్య గమనిక. టికెట్లు బుక్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రూలు అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు వసూలు చేస్తున్న.. ఈ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్.. టీసీఎస్.. 5 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం.
Today Stock Market Roundup 26-04-23: ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నం స్వల్ప లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో వ్యాపారం నీరసంగా సాగింది. కాకపోతే.. సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు లాభాలతో ఎండ్ కావటం చెప్పుకోదగ్గ అంశం.
Rice Shortage: ఈ సంవత్సరం.. ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత నెలకొననుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూలేనంతగా ఈసారి గ్లోబల్ రైస్ మార్కెట్‌లో షార్టేజ్ ఏర్పడనుందని ఫిచ్ సొల్యూషన్స్ సంస్థ పేర్కొంది. 2003-04 సంవత్సరంలో 18 పాయింట్ 6 మిలియన్ టన్నుల బియ్యం కొరత తలెత్తగా 2022-23లో 8 పాయింట్ 7 మిలియన్ టన్నుల
Birla returns: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మళ్లీ వొడాఫోన్-ఐడియా బోర్డులోకి వచ్చారు. ఈ నెల 20వ తేదీ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి వొడాఫోన్-ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్‌కి 18 పాయింట్ సున్నా ఏడు శాతం వాటా ఉంది.