Payment with Credit Card: క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే 20 శాతం ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payment with Credit Card: విదేశీ యాత్రలకు వెళ్లేవాళ్లకి ముఖ్య గమనిక. టికెట్లు బుక్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రూలు అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు వసూలు చేస్తున్న.. ఈ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్.. టీసీఎస్.. 5 శాతం మాత్రమే కావటం గమనించాల్సిన విషయం. అది ఇప్పుడు 20 శాతానికి పెరిగింది.
read more: Rice Shortage: ప్రపంచవ్యాప్తంగా బియ్యం కొరత. గడచిన 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత..
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ఏటీఎం కార్డు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ వంటి ఇతరత్రా చెల్లింపులకు ఇప్పటికే ఈ 20 శాతం టీసీఎస్‌ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఈ విదేశీ చెల్లింపులను.. సరళీకృత చెల్లింపు పథకం.. ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తేవాలని 2023 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఈ సూచన చేసింది.
దీంతో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్‌లో పొందుపరిచారు. దీనివల్ల.. ఫారన్ ట్రిప్‌లకు వెళ్లేవాళ్ల పర్సనల్ బడ్జెట్ పెరుగుతుంది. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డుతో 2 లక్షల రూపాయలు చెల్లిస్తే.. అదనంగా మరో 40 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావటం వల్ల ముఖ్యంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకటి.. ఫారన్ ట్రిప్ టికెట్లను లోకల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసినా.. ఓవర్సీస్ ఏజెంట్ ద్వారా బుక్ చేసినా ఒకే పన్ను విధానం అమలవుతుంది. రెండు.. విదేశీ చెల్లింపులను ట్రాక్ చేయటం, రిపోర్ట్ చేయటం ద్వారా ట్యాక్స్ పరిధిని పెంచొచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే.. క్రెడిట్ కార్డ్ పేమెంట్లను ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావటం అంత తేలిక కాదని కూడా వాళ్లు అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే.. ఎడ్యుకేషన్ మరియు మెడికల్ పర్పస్ చేసే చెల్లింపులు ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ పరిధిలోకి రావట్లేదు. కాబట్టి.. ఈ చెల్లింపుల్లో ఏవి టీసీఎస్ కిందికి వస్తాయో? ఏవి రావో? గుర్తించటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. ప్రతి లావాదేవీనీ ఈ కోణంలో పరిశీలించటం బ్యాంకులకు సాధ్యం కాదని నిపుణులు తెలిపారు. ఒకే మర్చెంట్ వివిధ రకాల ట్రాన్సాక్షన్లు చేస్తుంటాడు.
అందులో కొన్ని టీసీఎస్ కిందికి వస్తాయి. కొన్ని రావు. ఇంటర్నేషనల్ మర్చెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి పెద్ద సంఖ్య జరిగే ఆ లావాదేవీల వర్గీకరణ అంత సులవు కాదు. ఇది ఈజీ అవ్వాలంటే క్రెడిట్ కార్డ్ సిస్టమ్‌లోనే మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కస్టమర్‌కి ముందే చెప్పాలని, వాళ్ల అంగీకారంతోనే పేమెంట్ చేయాలని అన్నారు.
టీసీఎస్ ఆటోమేటిగ్గా కట్ అవ్వాలంటే పాపప్ మెసేజ్ వచ్చే ఏర్పాటుచేయాలని తెలిపారు. దీనికితోడు.. ప్రస్తుతం ఒక
వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రెండున్నర లక్షల డాలర్ల వరకు మాత్రమే విదేశీ చెల్లింపులు చేయటానికి వీలుంది. అందువల్ల.. క్రెడిట్ కార్డులతో చేసే పేమెంట్లు కూడా ఈ పరిమితిలోకి వస్తాయా రావా అనే క్లారిటీ లోపించింది. అయితే.. టీసీఎస్ అనేది ట్యాక్స్ కాదు.
ఇది.. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయపు పన్ను పరిమితిలో సర్దుబాటు చేస్తారు. వీలైతే రిఫండ్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే.. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ ముందు నుంచే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!