Goa Nightclub Blast: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో శనివారం రాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఒక నైట్‌క్లబ్‌లో సిలిండర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది మృతి చెందారు. రాష్ట్ర రాజధాని పనాజీ నుంచి దాదాపు 25 కి.మీ దూరంలో ఘటనాస్థలం ఉంది. గతేడాది ప్రారంభమైన ఫేమస్ క్లబ్ బిర్చ్ బై రోమియో లేన్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
READ MORE: Scrub Typhus Ravaging AP: ఏపీని వణికిస్తున్న స్రబ్ టైఫన్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంటగదిలో పనిచేస్తుండగా, సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోయింది. శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. దీంతో నైట్‌క్లబ్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమీప నివాసితులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ అంశంపై గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం గురించి రాత్రి 12:04 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిందని చెప్పారు. “పోలీసులు, అగ్నిమాపక దళం, అంబులెన్స్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. మృతదేహాలను వెలికితీశాం. క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని వంటగది ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 23 మంది చనిపోయినట్లు నిర్ధారించాం. అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం సిలిండర్ పేలుడు అని తెలుస్తుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.” అని వివరించారు.
READ MORE: Smartwatch: నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించొచ్చా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఇంతలో, సమాచారం అందుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో పర్యాటకులు ఎవరూ గాయపడలేదని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. మంటలు చెలరేగిన సమయంలో క్లబ్‌లో సిబ్బంది కాకుండా చాలా మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు. కానీ వారందరూ సకాలంలో తప్పించుకున్నట్లు స్థానికులు, ఉద్యోగుల తెలిపారన్నారు.