Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే […]
MrBeast Meets Bollywood’s Legendary Trio: హిందీ సినిమాలో అత్యుత్తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే చాలా మంది దిగ్గజ నటులు ఉన్నారు. నటనతోపాటు ఫిట్నెస్కి ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ యూట్యూబర్‌తో పాటు హిందీ సినిమాకి చెందిన ఈ ముగ్గురి ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో పాటు ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు సూపర్‌స్టార్…
Ramayana: బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’. భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టుగా నిలిచింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్న ఈ మూవీ అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుమారు రూ.4,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చలనచిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. తాజాగా ఈ సినిమా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చిత్ర బృందం కీలక అప్డేట్ను షేర్ చేసింది.…
Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై 2003 అక్టోబరు…
Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్లపై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన నన్ను గుడ్డు అంటారు.. నేను పప్పు అంటాను. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఉండదని తెలిపారు.. ఏపీలో గూగుల్ రాకను తాము స్వాగతిస్తుమన్నానిచెబితే కూటమి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రైడన్ 1గిగా వాట్ డేటా సెంటర్ వల్ల 200మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారని గుర్తు చేశారు...
Khawaja Asif: భారత్‌పై ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ తాజాగా మితిమీరిన ప్రకటనలు చేస్తోంది. ఓ వైపు ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఎదుర్కొనేందుకు సత్తాలేని పాక్.. భారతదేశంపై యుద్ధానికి సిద్ధమంటూ వివాదాస్పద ప్రకటన చేసింది. తాజాగా ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆఫ్ఘన్‌పై యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమని.. అవసరమైతే భారతదేశంపై దాడులు చేస్తామని చెప్పాడు. పాకిస్థాన్ రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉందని అన్నారు.
Fake Liquor Lab Report: ములకలచెరువు నకిలీ మద్యానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు వెలువడింది. జనార్దన్ తయారు చేసిన నకిలీ మద్యం నాణ్యత లేనిదని రిపోర్టులో తేలింది. 45 నమూనాలపై పరీక్షలు చేసిన కాకినాడ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. స్త్రెంత్ ప్రమాణాలు పాటించకుండా మద్యం తయారు చేసినట్లు తేలింది. 25 ఉండాల్సిన అండర్ ప్రూఫ్ (యూపీ) 35గా నమోదైంది. 75 ఉండాల్సిన ఓవర్ ప్రూఫ్ 65గా ల్యాబ్ రిపోర్టులో తేలింది. ప్రమాణాలకు విరుద్ధంగా మద్యం తయారు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. నకిలీ మద్యంలో నాణ్యత…
Gujarat cabinet: గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. అయితే.. గుజరాత్ ప్రభుత్వం ఈరోజు ఉదయం 11:30 గంటలకు మంత్రి వర్గాన్ని విస్తరించనుంది. కొత్త మంత్రివర్గంలో 15 మంది కొత్త వ్యక్తులు సహా 25 మంది సభ్యులు ఉంటారని చెబుతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మంత్రుల్లో కొందరు కొత్త లిస్ట్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా […]
Kumuram Bheem Asifabad: భార్య మీద కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి... ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లా పటార్లో చోటు చేసుకుంది. ఎల్లాపటార్‌కు చెందిన షమాబీకి జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో 9 నెలల కిందట వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో తరుచూ గొడవ పడేవాడు. తాజాగా ఎల్లాపాటార్ వచ్చి మళ్ళీ భార్యతో గొడవపెట్టుకున్నాడు.. గొడవ ఒక్కసారిగా పెరిగింది. దీంతో అత్తింట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్…
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్-1లో డిమాండ్ చేసింది. గతేడాది జూలై-ఆగస్టులో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా 1,400 మంది మరణించారు. ఈ మరణాలను హత్యలుగా అభివర్ణించింది తాత్కాలిక ప్రభుత్వం.. హత్యలకు గాను హసీనాకు "1,400 మరణశిక్షలు" విధించాలని తాత్కాలిక ప్రభుత్వ న్యాయవాది ICT-1లో వాదించారు. గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం…