Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agadha Trailer: మిస్టరీ, హారర్, అతీంద్రియ ఎలిమెంట్స్ తో వచ్చే కంటెంట్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు అదే కోవలో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ‘అగధ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్. రాజు, మరోసారి దర్శకుడిగా హారర్ థ్రిల్లర్ కంటెంట్ తో వస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ తో ఆడియన్స్ ను వణికించేలా కనబడుతోంది. భిన్నంగా రూపొందించిన ‘అగధ’ ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠను పెంచుతోంది. కథను నేరుగా చెప్పకుండా, సీక్రెట్ ను క్రమంగా విప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. గర్భవతిగా ఉన్న మహిమ పాత్ర ఆత్మహత్యతో కథ ప్రారంభమవుతుంది. ఆ మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయడానికి బయలుదేరిన మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల కనిపిస్తారు. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ, ఇది మామూలు నేరం కాదని, ‘అగధ’ అనే అతీంద్రియ శక్తి ఈ ఘటన వెనుక ఉందనే విషయం బయటపడుతుంది. అక్కడి నుంచే మంచికి, చెడుకు మధ్య జరిగే ఆధ్యాత్మిక పోరాటం కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది.
ట్రైలర్లో కామాక్షి భాస్కర్ల తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతినాయకుడిగా కనిపించిన శ్రవణ్ రెడ్డి భయానకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. మొత్తానికి ‘అగధ’ ట్రైలర్ కి మంచి మార్కులే పడుతున్నట్లు కనిపిస్తోంది. భారీ ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన లుక్ తీసుకొచ్చాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఇంటెన్స్ విజువల్ ట్రీట్ కనిపిస్తోంది. రాకేష్ వెంకటపురం అందించిన నేపథ్య సంగీతం ఉత్కంఠను మరింత పెంచుతూ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎం.ఎస్. రాజు అందించగా, శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. అజయ్ కె.ఆర్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎన్.వి.ఎన్. సుబ్బరాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు.
Also Read
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
- Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
- Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. 'రామాయణ' మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కథకు ప్రాధాన్యం ఉన్న విభిన్న సినిమాలను ఆదరిస్తున్న నేపథ్యంలో, ‘అగధ’ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. పౌరాణిక నేపథ్యం, మిస్టరీ, హారర్, అతీంద్రియ అంశాలను కలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తోంది. ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూస్తే, సినిమా విడుదలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. ‘అగధ’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ ఇచ్చిన హామీని సినిమా నిలబెట్టుకుంటే, ఈ ఏడాది అతీంద్రియ థ్రిల్లర్ల జాబితాలో ‘అగధ’ ప్రత్యేక స్థానాన్ని సంపాదించే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. శరవేగంగా పోలింగ్ ప్రక్రియ!
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
-
Trump on Iran Attack: ‘‘ముందే చెబుతానా ఏంటి?’’.. ఇరాన్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!