James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
James Hopes: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ (PBKS) వెనుకబడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయి, వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హోప్స్ మాట్లాడుతూ.. “ఇది నిజంగా నిరాశకు గురిచేస్తోంది, ప్రస్తుతం మేము ఎలిమినేషన్ అంచున ఉన్నాం. ఇంకా ఆశలైతే సజీవంగానే ఉన్నాయి కానీ, మేము పుంజుకోవాల్సి ఉంది. పవర్‌ప్లేను బాగానే నియంత్రించినప్పటికీ, మేము మొమెంటం సాధించిన ప్రతిసారీ ప్రత్యర్థి జట్టు ఒక పెద్ద ఓవర్‌తో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. ఇక ఛేజింగ్‌లో మంచి ఆరంభం లభించినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ నెమ్మదించింది” అని విశ్లేషించారు. అయితే, మైదానం వెలుపల జరుగుతున్న వివాదాల వల్లే పంజాబ్ ప్రదర్శన దెబ్బతిన్నదనే వాదనలపై కోచ్ క్లారిటీ ఇచ్చారు. ఈ వాదనలు తప్పుబట్టారు. మ్యాచ్‌లలో మొమెంటాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నామన్నారు. గెలిచే స్థితికి వచ్చిన ప్రతిసారీ తమకు తామే నష్టం చేసుకున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు, పంజాబ్ పేస్ గుర్రం అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ తీసి పేలవ ప్రదర్శన చేసినప్పటికీ కోచ్ అతనిని సమర్థించారు. టోర్నమెంట్ ద్వితీయార్ధంలో అర్ష్‌దీప్ చాలా దూకుడుగా, అద్భుతంగా బౌలింగ్ చేశాడని, కొన్ని క్యాచ్‌లు మిస్ అవ్వడం, మరికొన్ని అవకాశాలు చేజారడం వల్లే ఫలితాలు ఇలా ఉన్నాయని చెప్పారు. ప్రతి ట్రైనింగ్ సెషన్, ప్రతి మ్యాచ్‌కు అతను ఒక యోధుడిలా సిద్ధంగా ఉంటాడని కొనియాడారు. ఇదే సమయంలో, ఆర్సీబీ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తాజా విజయంపై స్పందిస్తూ.. భువనేశ్వర్ కుమార్‌తో కలిసి బౌలింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. భువీ ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ, పరుగులను నియంత్రిస్తాడని.. భారతదేశంలో పెరిగి ఇక్కడి పరిస్థితులు, ఆటగాళ్లపై అతనికి ఉన్న అవగాహన తమ బౌలింగ్ విభాగానికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకోవడంపై హేజిల్‌వుడ్ సంతోషం వ్యక్తం చేశారు. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌కు ముందు ఇక్కడి పరిస్థితులపై ఒక అవగాహన రావడం మంచిదని, తదుపరి హైదరాబాద్ మ్యాచ్‌కు, అలాగే క్వాలిఫైయర్ 1 (Q1) మ్యాచ్‌కు మధ్య తగినంత సమయం దొరకడం వల్ల ఆటగాళ్లు సేదతీరి, నాకౌట్ పోరులో పూర్తి బలంతో బరిలోకి దిగుతారని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!