V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.D. Satheesan: కేరళంలో దశాబ్దం కాలం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆరుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.డి. సతీశన్ సోమవారం కేరళం 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. సతీశన్, 20 మంది సభ్యుల మంత్రిమండలితో పదవీ స్వీకార, రహస్య విధి నిర్వహణ ప్రమాణాలు చేయించారు.
ఈ అట్టహాసమైన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వీరితో పాటు విపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నాయకులు సైతం విచ్చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ను ఓడించి కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో వేలాది మంది యూడీఎఫ్ శ్రేణులు, మద్దతుదారులు మైదానానికి తరలివచ్చారు. ప్రజాస్వామ్య బదిలీ ప్రక్రియకు అద్దం పడుతూ, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోనున్న మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సైతం వేదికపై కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరుకావడం విశేషం.
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఇక ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీలో ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని, ఎల్డీఎఫ్ పదేళ్ల సుదీర్ఘ పాలనకు తెరదించింది. గత ఐదేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా, దూకుడుగా నిలదీసిన వి.డి. సతీశన్కే ఈ అద్భుత విజయానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ దక్కింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి రాష్ట్ర సీనియర్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చలు జరిపిన అనంతరం, సతీశన్ను కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి సతీశన్తో పాటు ఆయన 20 మంది సభ్యుల మంత్రిమండలి కూడా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసింది. కేరళం చరిత్రలో దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఒకే రోజు, ఒకే వేదికపై పూర్తి స్థాయి క్యాబినెట్ ప్రమాణం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కొత్త క్యాబినెట్ కేరళం రాజకీయాల్లో “తరాల మార్పును” (generational shift) ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 21 మంది ఉన్న ఈ మంత్రివర్గంలో 14 మంది సరికొత్త ముఖాలు (తొలిసారి మంత్రులైన వారు) కావడం గమనార్హం.
ఈ క్యాబినెట్లో యూడీఎఫ్ కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలకు కూడా సముచిత స్థానం దక్కింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కు ఐదు మంత్రి పదవులు దక్కగా, కేరళం కాంగ్రెస్ వర్గాలు, ఇతర మిత్రపక్షాలకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించారు. తాజా నివేదికల ప్రకారం.. ముఖ్యమంత్రి సతీశన్ తన వద్దే ఆర్థిక, రేవుల (పోర్ట్స్) వంటి కీలక శాఖలను ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలకు హోం శాఖతో పాటు విజిలెన్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్కు రెవెన్యూ శాఖ దక్కవచ్చని సమాచారం.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..