రాత్రి త్వరగా తినాలని ఎప్పటికప్పుడు పెద్దలు చెబుతూనే ఉంటారు. కాని మన పరిస్థితులు, పని చేసే కార్యాలయాల్లోని టైమింగ్స్ కారణంగా రాత్రి లేట్ గా భోజనం చేస్తుంటాం. వీలైనంత వరకు రాత్రి 7 గంటలలోపే తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. డెలివరీ బాయ్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో హృదయ విదారకమైన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటో రిక్షాలో డంప్‌యార్డుకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టాడు.
ఓ రిటైర్డ్ ఉద్యోగి తన నిజాయితీని చాటుకున్నారు. తన పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం తన ఖాతాలో జీతం నగదు జమ చేసింది. అది చూసిన ఆయన వెంటనే అధికారులను సంప్రదించి నగదు తిరిగి తీసుకోవాలని రాత పూర్వకంగా తెలిపారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని సోన్‌భద్రలో ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది.
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా పరీక్ష నిర్వహిస్తుంటారు. అదే పాలిసెట్. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ముగిసింది. ఇటీవలె మూల్యాంకనం కూడా పూర్త అయ్యింది. ప్రస్తుతం, ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. "ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ.
ఎండా కాలంలో ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఇళ్లల్లో ఏసీలను పెట్టుకుంటున్నారు. కాని వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. వేసవి ఉక్కపోత నుంచి రక్షణ పొందేందుకు పెట్టించుకున్న ఏసీలు కాస్త పేలుతున్నాయి. అందుకే ఏసీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని.. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించిందన్నారు.