డాక్టర్ కావాలనే కలను నెరవేర్చే నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం NTA విడుదల చేసింది. NEET అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూడొచ్చు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లో వారి ఫోటో బార్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల కోసం NEET అధికారిక వెబ్సైట్ Exams.nta.ac.in/NEET […]
ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్ తీర్పు వైవిధ్యమైందని.. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కక్షపూరితమైన పాలన తోనే జగన్ ను ఓటమిపాలయ్యారని విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడే ప్రజలు చంద్రబాబును గెలిపించాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
దాదాపు దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఫలితాలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, డాక్టర్. కే. నారాయణ హాట్ కామెంట్ చేశారు. దేశం మొత్తం మీద మోడీ హవా కొనసాగుతుందని 400 పై చిలుకు సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నవారికి దేశ ప్రజలు గట్టి గుణపాటాన్ని నేర్పించారన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాని అసలు ఫలితాల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు.
బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి.. నైతికంగా తాము గెలిచామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సారి చెప్తున్నాం.. గెలుపు ఓటములు సహజమన్నారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.
వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ఫలితాలలో తాము ఊహించిన మెజారిటీ రీచ్ అయ్యామని కడియం కావ్య అన్నారు. డాక్టర్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు.