-
26/11 Mumbai Attack: త్వరలో భారత్‌కు.. 26/11 ముంబై దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాది!
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారత్‌కు అప్పగించవచ్చు. రాణాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్‌లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్‌కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది. -
PSLV-c60: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 60.. నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలు!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం రాత్రి పీఎస్ఎల్వీ-సీ 60 (PSLV-c60) రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నింగిలోకి దూసుకెళ్లింది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. -
New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలు ఇలా జరుపుకోండి.. జీవితాంతం గుర్తుండి పోతుంది?
మరో కొన్ని గంటల్లో 2024కు వీడ్కోలు పలికి.. 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. 2024 డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఎలా జరపుకోవాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే దీన్ని ఆరోగ్యకరమైన రీతిలోనూ, ఆహ్లాదంగానూ జరుపుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని పెద్దలు చెబుతున్నారు. -
Formula E Car Racing Case: రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ.. కేటీఆర్ అరెస్ట్‌పై ఉత్కంఠ!
రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ జరగనుంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. రేపటితో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగియనున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ కోర్టును మరోసారి కోరనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ సమాధానమిచ్చారు. -
Adani Group: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్‌తోజాయింట్ వెంచర్‌కు గుడ్ బై..
అదానీ గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్ షేర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. విల్మార్ లిమిటెడ్‌లో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా బలమైన చర్చ జరిగింది. ఈరోజు ఈ అంశానికి ఆమోదం కూడా లభించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అదానీ విల్మార్ లిమిటెడ్ నుంచి నిష్క్రమించాలని అదానీ గ్రూప్ తన విక్రయాలను రెండు దశల్లో పూర్తి చేస్తుంది. అదానీ విల్మార్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మొత్తం వాటా 44 శాతం కలిగి ఉంది. -
TG ACB: తెలంగాణ ఏసీబీ సంచలన విషయాలు.. ఈ ఏడాది అవినీతిలో ఆ శాఖలదే పైచేయి..
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. -
KTR: మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే(వీడియో)
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. పార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీలో డాక్టర్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము అభినందిస్తున్నాం. భారతదేశానికి గౌరవప్రదంగా సేవ చేసిన ఏకైక ప్రధానమంత్రి పీవీ… -
Viral News: దొంగ భక్తుడు.. హనుమంతుడికి పూజలు చేసి, కిరీటాన్ని దొబ్బేశాడు..(వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. -
Maharashtra: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బ్యాట్స్ మెన్ మృతి (వీడియో)
మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్'లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. -
World’s Best Actors: ప్రపంచ ఉత్తమ నటుల జాబితా విడుదల.. భారత్ నుంచి ఒకే ఒక్కరు..
బ్రిటిష్ ఆన్లైన్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ఇటీవల 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని అత్యుత్తమ నటుల జాబితాలో భారతదేశం నుంచి ఒకరి పేరు మాత్రమే చేర్చారు. ఈ జాబితాలో తెలుగు యాక్టర్లు కాదు కదా.. బాలివుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్, సల్మాన్ ఖాన్ కు కూడా చోటు దక్కలేదు. ప్రస్తుతం ఈ లోకంలో లేని.. ఇర్ఫాన్ ఖాన్ ను చేర్చారు.
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!