యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉండనుంది.
READ MORE: Pawan Kalyan: అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం
కాగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్ చిత్రాల దర్శకూడు కొరటాల శివ కలయికలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దేవర ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మిలియన్ వ్యూస్ రాబడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన రాబట్టింది. తారక్ స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ,విజువల్ ఫీస్ట్ అందించాయి. మరి ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే షార్క్ తో ఎన్టీయార్ పోరాడే సీన్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గ నిలిచింది అని చెప్పడంలో అతిశయొక్తి లేదు. అత్యధిక వ్యూస్ రాబట్టి గ్లోబల్ లెవల్ లో ట్రేండింగ్ లో ఉంది. య్యుట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ సినిమాల సరసన దేవర టాప్ లి నిలిచింది. మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ రెబల్స్ రీసెంట్ హిట్స్ కల్కి, సలార్ అడ్వాన్స్ సేల్స్ ను క్రాస్ చేసింది.