రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నిరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ.. నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కునాకు సంభందం లేదు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు, ఆమె డ్రగ్స్ బానిస, కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది అని రాజ్ తరుణ్ వాదన.
READ MORE: Sai Dharam Tej: మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హీరో సాయి ధరమ్ తేజ్.. రూ.10 లక్షలు విరాళం
కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు రాజా రవీంద్ర.. రాజ్ తరుణ్ ను పలు ప్రశ్నలు అడిగాడు.. నీకు ఉన్న ఓపిక భూమికి కూడా ఉండదని రాజ్ తరుణ్ ని కొనియాడాడు. ఇండస్ర్టీలో పదేళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నామని.. పర్సనల్ గా మీరు ఎలా ఉంటారో తనకు తెలుసన్నాడు. కానీ పబ్లిక్ లో మీకు ఉన్న ఇమేజ్ కి ఏ సంబంధం లేదు.. అలా ఎందుకు ప్రొజెక్ట్ అవుతుంది.? అని రాజ్ తరుణ్ ని రవీంద్ర అడిగాడు.. . దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ.. స్ర్కీన్ లో చూసినప్పుడు యాక్సన్- కట్ మధ్య నేను.. వేరు కట్ తర్వాత నేను వేరన్నాడు. రాజ్ తరుణ్ ఇంకా మాట్లాడుతూ.. “ఇలాంటి న్యూస్ లు వచ్చినప్పుడు వెంటనే ఎఫెక్ట్ కావడం కామన్.. నేను అల్లరల్లరిగా, హైపర్ యాక్టివ్ గా చేసిన సినిమాలు చూసి అందరూ అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండను.. నాకు అలవాటు లేదు. సినిమా రిలీజ్ కి ముందు పోస్టర్లు పెట్టడం తప్ప ఇంకేం తెలియదు. ఎలా పోస్ట్ పెట్టాలి అని పక్కోళ్లని అడుగుతా. భయటకు ఎక్కడికీ వెళ్లను. నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు నా ఇంటికే వస్తారు. నేను ఇంట్రోవర్ట్ అవ్వడం వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిఉండొచ్చు.” అని పేర్కొన్నాడు.
READ MORE: Potatoes: బంగాళదుంపతో ఎన్ని లాభాలో..!
అనంతరం రవీంద్ర .. హిరో రాజ్ తరుణ్ టాలెంట్ ని మెచ్చుకున్నాడు. డైరెక్సన్ చేయమంటే అద్భుతంగా చేస్తారని.. మీకు ఇంత టాలెంట్ ఉన్నా.. సినిమాలు ఎందుకు హిట్ కావడం లేదని.. కథ మధ్యలో ఏదైనా తప్పుగా అనిపిస్తే.. డైరెక్టర్ కి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రాజ్ తరుణ్ సమాధానమిస్తూ.. ముందు హిట్స్ లేవుకు కాబట్టి.. డైరెక్టర్లు వినడం లేదన్నాడు. ఇప్పుడు రాబోయే సినిమా తర్వాత వింటారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. క్రియేటివ్ వర్క్ లో అంత ఎఫర్ట్ పెట్టలేక పోయానని రాజ్ పేర్కొన్నాడు. దానికి గల కారణాలను కూడా వెల్లడించాడు.
అందుకే నాకు ఈ ప్రాబ్లం..! : Raj Tarun#RajTarun #BhaleUnnade #RajaRavindra #Lavanya #MalviMalhotra #NTVENT #NTVTelugu pic.twitter.com/22gWvHeC6J
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) September 11, 2024