రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
విదేశీ పర్యటనపై కొంతమంది సినిమా షో ప్లాప్ అయ్యిందని అంటున్నారని.. మా విజన్ వాళ్ళ ముందు పెట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ వరకే కంపెనీలను పతిమితం చెయ్యమని.. ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కంపెనీలు పెడతామన్నారు.
మాదాపూర్ లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీ 100 ఫీట్ రోడ్ లో ఫ్రైడే అప్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీని కేటుగాళ్లు నిర్వహించారు. కన్సల్టేషన్ కంపెనీ దాదాపు 600 మందికి పైబడిన నిరుద్యోగుల నుంచి రూ.1లక్ష , రూ. 50,000 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.
తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపు దిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.
హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డ మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.