Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins: ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన ఈ వండర్ కిడ్.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి కమిన్స్‌తో సహా ఎందరో దిగ్గజ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీ క్రీజ్‌లో ఉన్నప్పుడు బౌలింగ్ చేయడం ఎంత కష్టమో వివరిస్తూ.. ఆ కుర్రాడు గ్రౌండ్లో కంటే ఇంకా స్కూల్లోనే ఉండి ఉంటే బాగుండేదని కమిన్స్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఫాక్స్ క్రికెట్‌తో కమిన్స్ మాట్లాడుతూ.. వైభవ్ అద్భుతమైన టాలెంట్ అని, బంతిని చాలా బలంగా, చాలా దూరం బాదుతాడని కొనియాడాడు. అతనికి బౌలింగ్ చేసేటప్పుడు ఏమాత్రం పొరపాటు చేసినా శిక్ష తప్పదని, 15 ఏళ్ల వయసులో ఇలాంటి బ్యాటింగ్‌ను తాను ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతని వయసు 15 అయినా ఒక అసాధారణ హిట్టర్ అని కమిన్స్ ప్రశంసించాడు.
ఎస్ఆర్హెచ్పై సూర్యవంశీ విధ్వంసం..
ఐపీఎల్ 2026 సీజన్లో సగం మ్యాచుకు దూరమైన కమిన్స్.. పునరాగమనం చేసిన మొదటి మ్యాచ్‌లోనే సూర్యవంశీ విశ్వరూపాన్ని చవి చూశాడు. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్ లాంటి దిగ్గజాలకు ఎదురైన అనుభవమే కమిన్స్కూ ఎదురైంది. కమిన్స్ వేసిన తొలి బంతినే సూర్యవంశీ సిక్సర్‌గా మలిచాడు. ఆ మ్యాచ్‌లోనే ఈ యువ సంచలనం కేవలం 36 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. అయితే ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సూర్యవంశీ మరింత ఉగ్రరూపం దాల్చాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. ఆ రాత్రి వైభవ్ సృష్టించిన విధ్వంసానికి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. తన 4 ఓవర్లలో ఒక్క వికెట్ సైతం తీయకుండా, 16 ఎకానమీ రేటుతో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సూర్యవంశీ చేసిన ఈ భారీ డ్యామేజ్ వల్ల రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2026 ప్రయాణానికి అక్కడితో తెరపడింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?