Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపాయి. ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులను రాత్రి సమయంలో అపోలో ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య బృందం అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. రోగుల ప్రయాణ వివరాలు, వైద్య చరిత్ర, సంప్రదించిన వ్యక్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పరిస్థితిని ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక, ఇప్పటికే.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (డీఆర్ కాంగోలో) ఎబోలా మహమ్మారి వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర స్థితిగా (పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఈ మహమ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఇది అత్యంత అరుదైన వైరస్ రకానికి చెందినది. దీనికి ఎలాంటి టీకా లేదు. డీఆర్ కాంగోలో అంతర్గత సంఘర్షణలు నెలకొన్న ప్రాంతంలో ఈ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి ఊహించినదానికంటే వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఎబోలా లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి:
1. ప్రారంభ లక్షణాలు (Early Symptoms)
వ్యాధి సోకిన మొదట్లో ఇవి సాధారణ జ్వరం లేదా ఫ్లూ లాగే అనిపిస్తాయి.
తీవ్రమైన జ్వరం (High Fever)
అపరిమితమైన అలసట, నీరసం
కండరాలు, కీళ్ల నొప్పులు
తీవ్రమైన తలనొప్పి
గొంతు నొప్పి లేదా మంట
2. తదుపరి తీవ్రమైన లక్షణాలు (Advanced Symptoms)
వ్యాధి ముదురుతున్న కొద్దీ శరీరంలోని అంతర్గత అవయవాలపై ప్రభావం పడుతుంది:
వాంతులు, విరేచనాలు (డయేరియా) మొదలవుతాయి.
కడుపు నొప్పి
చర్మంపై దద్దుర్లు (Rash)
కాలేయం, మూత్రపిండాల (Kidneys) పనితీరు మందగించడం
రక్తస్రావం (Bleeding): వ్యాధి బాగా ముదిరినప్పుడు కొంతమందిలో అంతర్గతంగా (Internal), బాహ్యంగా (External) రక్తస్రావం జరగవచ్చు. ఉదాహరణకు చిగుళ్ల నుంచి రక్తం కారడం, వాంతులు లేదా మలవిసర్జనలో రక్తం పడటం వంటివి జరుగుతాయి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!