Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘వైభవ్ సూర్యవంశీ’ పేరే మారుమోగిపోతోంది. ఐపీఎల్ 2026 (IPL 2026)లో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రపంచ స్థాయి బౌలర్లను చిత్తు చేస్తూ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మరెన్నో అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించడం వెనుక అతని కఠోర శ్రమ, పట్టుదల, ధైర్యం దాగి ఉన్నాయి. ఈ మెరుపు ప్రదర్శనకు కానుకగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా తమ బ్రాండ్ న్యూ ‘సియెర్రా ఎస్యూవీ’ (Sierra SUV) ని అతను బహుమతిగా ఇచ్చింది. అంతకుముందు ఐపీఎల్ 2025లోనూ అదరగొట్టినందుకు గాను వైభవ్‌కు ‘టాటా కర్వ్’ (Tata Curvv) కారు కానుకగా లభించింది. గత సీజన్, ఈ సీజన్‌తో కలిపి వైభవ్ రెండు టాటా కార్లను సొంతం చేసుకున్నాడు.
వైభవ్ గెలుచుకున్న ఈ రెండు కార్లు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో అదరగొడుతున్నాయి. సరికొత్త టాటా సియెర్రా ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు ఉంటుంది. ఇది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. రెడ్-డాట్ అవార్డు పొందిన డిజైన్, ఫ్లో-ఫ్లుష్ డోర్ హ్యాండిల్స్, బయాస్-ఎల్ఈడి (Bi-LED) ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, 450 మిమీ వాటర్ వేడింగ్ సామర్థ్యం దీని సొంతం. కారు లోపల ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 12.3-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే, ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ & పవర్డ్ సీట్లు, ఏఆర్ (AR) హెడ్స్-అప్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న జేబీఎల్ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యాష్‌బోర్డ్‌పై ప్రీమియం సోనిక్ సౌండ్‌బార్, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, సూపర్ గ్లైడ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ సస్పెన్షన్ టెక్నాలజీ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా ఇది భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
Also Read
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ఇక గతంలో సూర్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన టాటా కర్వ్ విషయానికొస్తే.. దీని పెట్రోల్, డీజిల్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.9.70 లక్షల నుంచి రూ.19.10 లక్షల వరకు ఉండగా, కర్వ్ ఈవీ (EV) ధర రూ.16.99 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉంది. ఎస్యూవీ-కూపే రూఫ్‌లైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 208 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌తో దీని డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5-లీటర్ క్రయోజెట్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్న మోడరన్ DCT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ వేరియంట్లో 45 kWh, 55 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండగా, ఇవి ఒకే ఛార్జ్‌పై 502 కిలోమీటర్ల నుంచి 585 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 40 నిమిషాల్లోనే 10-80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులోనూ 12.3-ఇంచుల పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సబ్‌వూఫర్‌తో కూడిన ప్రీమియం జేబీఎల్ సౌండ్ సిస్టమ్, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, 500 లీటర్ల పెద్ద బూట్ స్పేస్, జెస్చర్-కంట్రోల్ పవర్డ్ టెయిల్‌గేట్ ఉన్నాయి. భద్రత కోసం 5-స్టార్ భారత్ NCAP రేటింగ్, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!