Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Politics: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. డీకే శివకుమార్ క్యాబినెట్ ఏర్పాటైన వెనువెంటనే అసంతృప్తులు మొదలయ్యాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు అత్యంత కీలకమైన ‘బెంగళూరు అభివృద్ధి’ (బెంగళూరు డెవలప్మెంట్) శాఖ దక్కుతుందని ఆశించగా, అది కాస్తా చేజారడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ శాఖను తనకు కేటాయించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కెమెరాల ముందే తన రాజీనామా లేఖపై సంతకం చేసిన రామలింగారెడ్డి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. ఈ పదవిని తనకు ఇస్తామని రెండుసార్లు మాట ఇచ్చారని, కానీ ఇప్పుడు తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పారు. బెంగళూరు అభివృద్ధి శాఖను నాకే ఇస్తానని డీకే శివకుమార్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా పంపించనున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉన్న రామలింగారెడ్డి.. బెంగళూరు అభివృద్ధి శాఖ మినహా మరే ఇతర మంత్రిత్వ శాఖను చేపట్టే ప్రసక్తే లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. అయితే, ఆయనకు మాత్రం ‘భారీ, మధ్యతరహా నీటిపారుదల’ (మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్) శాఖను కేటాయించారు. ఈ పరిణామం కర్ణాటక ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు డీకే శివకుమార్ తన వద్దే ఆర్థిక శాఖను ఉంచుకోగా, అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా తన వద్ద ఉన్న బెంగళూరు అభివృద్ధి శాఖను మాత్రం వదులుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన శాఖగా పేరున్న ఈ బెంగళూరు అభివృద్ధి శాఖను ఇప్పుడు కృష్ణ బైరేగౌడకు కేటాయించారు. ఈ శాఖ కోసం పట్టుబట్టిన రామలింగారెడ్డి, డీకే శివకుమార్‌తో జరిగిన సమావేశాల్లోనూ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. వేరే ఏ శాఖను అంగీకరించేందుకు సుముఖంగా లేరు.
Also Read
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
72 ఏళ్ల వయసున్న రామలింగారెడ్డి బెంగళూరులోని బీటీఎమ్ లేఅవుట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆయన రవాణా, హిందూ ధార్మిక దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హోం మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. ఇదిలా ఉంటే, గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన 53 ఏళ్ల కృష్ణ బైరేగౌడకు ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కింది. కర్ణాటక రాజకీయాల్లో ప్రముఖ వొక్కలిగ సామాజికవర్గ నేతగా గుర్తింపు పొందిన కృష్ణ బైరేగౌడది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి సి. బైరేగౌడ గతంలో కర్ణాటక శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం కృష్ణ బైరేగౌడ బేగూరు సమీపంలోని బ్యాటరాయనపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!