J&K: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్‌నాగ్‌కు చెందిన ప్రభుత్వ మాజీ వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ లాకర్ లో AK-47 రైఫిల్ లభ్యమైంది. పోలీసులు ఈ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత్‌నాగ్‌లోని జల్గుండ్ నివాసి ఆదిల్ 2024 అక్టోబర్ 24 వరకు GMC అనంత్‌నాగ్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. నౌగామ్ పోలీస్ స్టేషన్లో FIR నంబర్ 162/2025 కింద భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు,…
America Winchester Haunted House: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌జోస్ నగరంలో ఉన్న వించెస్టర్ హాంటెడ్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ భవనం వెనుక దాగి ఉన్న కథ, అనేక రహస్యాలు, అనుభవాలు, అసాధారణ సంఘటనలతో నిండి ఉంటుంది. ఈ భవనాన్ని “వించెస్టర్ మిస్టరీ హౌస్”గా కూడా పిలుస్తారు. ఇది అమెరికన్ గన్ తయారీ సంస్థ “వించెస్టర్ రిపీటింగ్ ఆర్మ్స్ కంపెనీ” వారసురాలు సారా వించెస్టర్ నిర్మించింది. సారా భర్త విలియం వించెస్టర్ గన్ కంపెనీ యజమాని. ఈ సంస్థ తయారు చేసిన…
HYDRA: వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. అభినందనల ప్లకార్డులతో అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మైత్రివనం వద్ద హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందన్నారు.
K.A. Paul: బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని.. కానీ కోర్టుకు సెలవిచ్చారన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టులో బెట్టింగ్ ఆప్స్ కేసు విచారణ లిస్ట్ అయినా.. కోర్టు షట్…
Bandi Sanjay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన బండి సంజయ్ మీటింగ్‌ను నిలిపేశారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని బీజేపీ ఎన్నికల ఇంఛార్జీ ధర్మారావు ప్రశ్నించారు.
Kishan Reddy: ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతాయని వెల్లడించారు.
PM Modi: మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. న్యూఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మోడీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ప్రధాని ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని జట్టును అభినందించారు.
Tamil Nadu: బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. ఈ విగ్రహాలపై తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తమిళనాడు కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారం, వెండి బల్లుల విగ్రహాల పనుల్లో గోల్మాల్ కలకలం సృష్టించింది.. వందల ఏళ్ల నాటి పాత బంగారాన్ని దొంగిలించారు..
Nalgonda: నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసుఫ్‌గూడలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రకాష్ భాకర్.. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా అభ్యర్థి యువకుడు, స్థానికుడు, ఉత్సాహవంతుడు అని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసినవారిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాల వల్ల…