Hyderabad: డ్రగ్స్ ఓవర్ డోస్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. పాత బస్తీ కాళాపత్తర్ కు చెంది అహ్మద్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి శివరాంపల్లి కెన్ వర్త్ అపార్ట్మెంట్ లో కో రిలేషన్ లో ఉంటున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి రూమ్ లో సేవించారు. అహ్మద్ మృతి చెందాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. యువతిని ఆసుపత్రికి తరలించారు. రూమ్ లో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. […]
Karimnagar: సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది ఏదీ లేదు. తమ పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. తల్లి ప్రేమకు అద్దంపట్టే హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందినప్పటి నుంచి తల్లి లచ్చమ్మ మనస్థాపానికి గురైంది. నిత్యం కొడుకు సమాధి వద్దకు వెళ్ళి ఏడుస్తూ జీవితం గడిపింది. గత వారం క్రితం కొడుకు సమాధి వద్దకార్ పాలిష్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కరీంనగర్ […]
Koti Deepotsavam 2025 Day 6: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఐదవ రోజు భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు.
Larissa Brazilian model: హర్యానాలో 2.5 మిలియన్ల నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ నవంబర్ 5న జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రెజిలియన్ మోడల్ ఫోటోను ఉటంకిస్తూ.. ఆ చిత్రాన్ని వేర్వేరు పేర్లతో 22 సార్లు ఉపయోగించారని ఆరోపించారు. ఓటర్ల జాబితా కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తావించిన బ్రెజిలియన్ మోడల్ ఓ ప్రకటన విడుదల చేసింది. తనకు భారత రాజకీయాలతో సంబంధం లేదని ఆమె పేర్కొంది. ఎవరో ఆమె ఫోటోను స్టాక్ ఇమేజ్ నుంచి కొనుగోలు…
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడి కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ కి చెందిన రోషన్‌సింగ్(25) ఓ రౌడీషీటర్. జగద్గిరిగుట్ట పరిధి సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) సైతం పాత నేరస్థుడు. రోషన్‌సింగ్ 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌ను మాట్లాడుకుని రంగారెడ్డినగర్‌లోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఆ…
Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ ప్రారంభమైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి దశలో 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ బూత్‌ల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసింది. అంతే కాదు.. ఎన్నికల కమిషన్ ప్రత్యక్ష వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని […]
Hyderabad Cybercrime Police: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల ప్రకటనల ప్రకారం.. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్‌బోర్డులు, యాప్‌లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో ఓట్ చోరీ అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. “హెచ్ ఫైల్స్” అనే శీర్షికతో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఎన్నికల రిగ్గింగ్ గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. బీహార్‌లోని 121 అసెంబ్లీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తుతూ […]
Hardik Pandya: హార్దిక్ పాండ్యా తరచుగా ఏదో ఒక కారణం చేత వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. గత కొన్ని రోజులుగా ఈ క్రికెట్ స్టార్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ అంశంలో వార్తల్లో నిలిచాడు. నటి, మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం.. జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. కానీ అకస్మాత్తుగా హార్దిక్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కనిపించాడు. ఇద్దరూ కలిసి కారు కడుగుతున్న […]
Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో మోనోరైలు రైలు పరీక్షా సమయంలో ప్రమాదానికి గురైంది. మోనోరైలు పట్టాలు తప్పడంతో దాని ముందు భాగం గాల్లోనే నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ, పరీక్ష సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద విషాదం తప్పింది. మోనోరైలు రైలు పట్టాలు తప్పి ఒక నిర్మాణాన్ని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. MMRDA, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నారు.