-
Bhagavad Gita: “ప్రతి భారతీయుడికి గర్వకారణం”.. భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు
భగవద్గీత, భరత ముని నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో వీటిని చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం అని ఆయన అభివర్ణించారు. -
Russia: ఆ వేడుకలకు మోడీకి ఆహ్వానం.. భారత్ నుంచి స్పందన లేదన్న రష్యా!
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ హాజరవుతున్నట్లు… -
MI vs SRH : మరోసారి రాణించిన అభిషేక్ శర్మ.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. -
Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు. -
JEE Main: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ ‘కీ’ వచ్చేసింది..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షకు తుది ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in నుంచి తుది ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. -
Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా తెలుసుకుందాం.. -
Tamil Nadu: వెయ్యి కిలోల ఆలయాల బంగారాన్ని కరిగించిన తమిళనాడు ప్రభుత్వం.. దాన్ని ఏం చేసిందంటే?
తమిళనాడు ప్రభుత్వం వెయ్యి కిలోల ఆలయ బంగారాన్ని కరిగించింది. ఈ బంగారం 21 ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదంతా నిరుపయోగంగా ఉందని..ఈ వెయ్యి కిలోల బంగారాన్ని కరిగించి 24 క్యారట్ల కడ్డీలుగా మార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్వర్ణాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం రూ.17.81 కోట్లు వడ్డీ వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
India- Pakistan: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది. -
Jagadambika Pal : ‘వక్ఫ్ చట్టంలో ఏదైనా తప్పు కనిపిస్తే, రాజీనామా చేస్తా’
వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. కాగా.. సవరణలోని వివిధ అంశాలకు సంబంధించి పిటిషన్లలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశపై తాజాగా వక్ఫ్ చట్టంపై ప్రశ్నలు లేవనెత్తే వారి కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ జాయింట్ కమిటీ (జెపిసి) ఛైర్మన్ జగదాంబికా పాల్ స్పందించారు.ఈ చట్టంలో ఒక్క తప్పు తేలితే, తాను తన ఎంపీ… -
JNU: జపాన్ పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులు.. తర్వాత ఏమైందంటే?
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విదేశీ మహిళా పరిశోధకురాలిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమని తేలడంతో ప్రొఫెసర్‌ను తొలగించారు. ఈ వేధింపుల సంఘటన కొన్ని నెలల క్రితం ఒక విశ్వవిద్యాలయ కార్యక్రమంలో జరిగింది. నిందితుడైన ప్రొఫెసర్‌పై గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!