విక్రాంత్ మాస్సే ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రం నవంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రాంత్ తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అతడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. జర్నలిస్ట్ ఈ హీరోకు బీజేపీ, ముస్లింలు, భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌లో ఏదో జరుగుతోంది.. హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధం..?
“మీరు బీజేపీని పెద్ద విమర్శకులు. ఇప్పుడు పాత మద్దతుదారులుగా మారారు. సెక్యులర్ నుంచి గట్టి హిందువుగా ఎలా మారారు?” అని అడిగారు. దీనిపై విక్రాంత్ మాస్సే .. “నేను నిజానికి బీజేపీకి పెద్ద విమర్శకుడిని. కానీ దేశవ్యాప్తంగా పర్యటించిన తర్వాత.. నేను చెడుగా భావించి చాలా అంశాలు నాకు చెడుగా అనిపించలేదు. ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని ప్రజలు చెప్పేవారు. కానీ దేశంలో ఎవరికీ ప్రమాదం లేదు. అంతా బాగానే జరుగుతోంది. అందుకే మారాను.” అని చెప్పాడు. ఇంకా విక్రాంత్ మాట్లాడుతూ.. తన తండ్రి క్రిస్టియన్, తల్లి సిక్కు, అన్నయ్య ముస్లిం అని తెలిపాడు. తన అన్నయ్య పేరు మొయిన్ అని. 17 ఏళ్ల వయసులో ఇస్లాంలోకి మారాడని చెప్పాడు. విక్రాంత్ వీడియోపై స్పందిస్తూ.. ‘విక్రాంత్ జీ సొంత గూటికి తిరిగి వచ్చినందుకు చాలా అభినందనలు. సెక్యులర్ గ్యాంగ్ నుంచి బయటపడటం చాలా కష్టం.” అని రాసుకొచ్చాడు.
READ MORE:CM Chandrababu: పదవులను బాధ్యతగా భావించాలి.. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం సూచన