పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్థం. కానీ, ప్రస్తుత కాలంలో మూడు ముళ్ల బంధం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. చిన్న చిన్న మనస్పర్థలకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే కొన్ని బంధాలు మాత్రం.. ప్రేమలోనే విచ్ఛిన్నం అవుతున్నాయి. మామూలుగా మీ భాగస్వామి తరచూ మీతో గొడవ పడుతుంటారు. అయితే.. మీ భాగస్వామి మిమ్మల్ని కావాలనే టార్గెట్ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నా… ఆ బంధం ప్రమాదకరంగా మారుతోందంటున్నారు నిపుణులు. మీ లవర్‌లో కనిపించే కొన్ని లక్షణాలు, వారి ప్రవర్తన తీరు ఆధారంగా ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చని సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఏంటంటే..
READ MORE: IAS Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
మీ భాగస్వామి కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో మనపై మనమే నమ్మకం కోల్పోయేలా చేస్తారు. మనల్ని బలహీనులుగా మార్చుతారు. చెప్పాలంటే అన్ని రకాలుగా మనల్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దాకా వాళ్లు నిద్రపోరు. దీన్నే ‘గ్యాస్‌లైటింగ్’గా పేర్కొంటున్నారు మానసిక నిపుణులు. ప్రతి చిన్న విషయంలో అబద్ధాలు ఆడడం వేధించే భాగస్వామిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తుంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించాలంటున్నారు. చిన్న చిన్న విషయానికే చిరాకు పడడం, అరవడం, కోప్పడటం.. లాంటివి వీరి ప్రవర్తనలో ఎక్కువగా గమనించచ్చు. ఇలాంటి వారు శారీరకంగా, మానసికంగానే కాకుండా.. భాగస్వామి భావోద్వేగాల పైనా దెబ్బకొడుతుంటాలని చూస్తారట. అందుకే భాగస్వామి మాటలు, చేతల్ని బట్టి వారి హింసాత్మక ధోరణిని పసిగట్టచ్చంటున్నారు నిపుణలు.
READ MORE: Deepika Padukone: అధిక వసూళ్లు సాధించిన దీపికా పదుకొణె టాప్ 10 సినిమాలు..
మీపై అసూయ, ద్వేషాల్ని పెంచుకుంటారు. ఇలాంటి వాళ్లకు మీరు చేసే పనులతో పాటుగా మీరు మాట్లాడే మాటలు రుచించవట! మీది తప్పన్నట్లుగా, వారు చెప్పేదే కరక్ట్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. వాళ్ల ప్రవర్తనతో మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
ఆరోగ్యకరమైన బంధంలో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడాలు అనేవి ఉంటాయి. కానీ మిమ్మల్ని వేధించాలని చూసే భాగస్వామి ఏ విషయంలోనూ రాజీ పడరట. అందుకే ఇలాంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.