సైబరాబాద్ పోలీసులు రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఆరు నెలల కాలంలో రెండు వేల సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ లేదా మిస్ అయిన సెల్ ఫోన్ లోని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ చిన్నారులపై దాడికి దిగుతున్నాయి.
సీఐ రవికుమార్‌పై పొక్సో కేసు నమోదైంది.హనుమకొండ పీజీఆర్ అపార్ట్మెంట్ లో ఉంటూ..అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న 16 ఏళ్ల మైనర్ బలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్రా నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ధూల్‌పేట్‌కు చెందిన గీతాబాయ్, శీలాబాయ్, క్రాంతిలను అరెస్ట్ చేశారు.
వేములవాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తాగిన మైకంలో తన పది నెలల శిశువుని రూ. లక్షకి విక్రయించింది. నిన్న సిరిసిల్ల కల్లు మండువాలో బేర సారాలు జరిగినట్లు సమాచారం.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డిఫర్మేషన్ దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ లను సాక్షులుగా పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను అమెరికాలో 6 సంవత్సరాలు చదువుకున్నానని.. చదువు పూర్తి అయ్యాక ఇండియాకు తిరిగి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు సంజయ్ కుమార్ తెలిపారు.
జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మర్డర్ ఎవరు చేసినా.. ఎవరు చేయించినా వదిలేది లేదని స్పష్టం చేశారు.
ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. సమస్యల పుట్ట ధరణి పోర్టల్ అని.. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశ్యంతో తీసుకువచ్చారని అనుకున్నామన్నారు. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారని చెప్పారు. రైతులకు అనేక ఇబ్బందులు కలిగాయని తెలిపారు.
కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉడుత ఊపులకు భయపడేది లేదని.. బండి సంజయ్ అన్నారని.. మళ్లీ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానన్నారు. రాహుల్ గాంధీకి మోడీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మాత్రం మోడీని అనుసరిస్తానని తెలిపారు. READ MORE: Jammu […]